Animal: ఏం సినిమారా బాబు..! ఇంకా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది.. ఇప్పుడు ఇలా
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన 'యానిమల్' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడమే కాక. 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా రికార్డులు బాక్సాఫీస్‌కే పరిమితం కాలేదు. తెలుగులోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. యానిమల్ సినిమా పై కొంతమంది విమర్శలు కూడా చేశారు.

గత ఏడాది విడుదలైన సినిమాల్లో అనిమల్ సినిమా ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ దర్శకుడిగా మారిన సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘యానిమల్’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడమే కాక. 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా రికార్డులు బాక్సాఫీస్‌కే పరిమితం కాలేదు. తెలుగులోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. యానిమల్ సినిమా పై కొంతమంది విమర్శలు కూడా చేశారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ పై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే చాలా రికార్డ్స్ ఈ సినిమా బ్రేక్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా దూసుకుపోతుంది.
ఈ సినిమా ఓటీటీలోనూ రికార్డు సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది యానిమల్. ‘యానిమల్’ డిసెంబర్ 1న ఓటీటీలో విడుదలైంది.ఆతర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ చిత్రం వరుసగా ఆరు వారాల పాటు ‘నెట్‌ఫ్లిక్స్’ టాప్ 10 లిస్ట్‌లో నిలిచింది. OTTలో కూడా ఈ సినిమాని ఆడియన్స్ విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇటీవల విడుదలైన సినిమాల్లో అత్యధికంగా వీక్షించిన సినిమా ‘యానిమల్’ రికార్డ్ క్రియేట్ చేసింది. ‘యానిమల్’ 6.2 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అలాగే షారుక్ ఖాన్ ‘డంకీ’కి 4.9 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ‘సలార్’ సినిమాకు కేవలం 1.6 మిలియన్ వ్యూయర్‌షిప్ మాత్రమే వచ్చింది. దీంతో ‘డంకీ’, ‘సాలార్’ చిత్రాలను ‘యానిమల్’ బీట్ చేసింది. కోవిడ్ సమయం నుంచి ఆడియన్స్ OTT కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కాగా నెట్‌ఫ్లిక్స్ ఇటీవల ఇండియన్ సినిమాలను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




