బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో డైరెక్టర్ రాజమౌళి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు జక్కన్న సినిమాల కోసం హాలీవుడ్ అడియన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశ, విదేశాల్లో రాజమౌళి సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ హిట్ కొట్టిన రాజమౌళి.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందే తన నెక్ట్స్ మూవీ మహేష్ బాబుతో ఉంటుందని ప్రకటించాడు. దీంతో వీరిద్దరి కాంబో పై మంచి హైప్ ఏర్పడింది. ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ గ్లోబల్ హిట్ కావడంతో రాజమౌళి, మహేష్ ప్రాజెక్ట్ ను హాలీవుడ్ స్థాయిలో నిర్మించనున్నారు. ఏడాదికి పైగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు.
ఇదిలా ఉంటే.. ఈ ప్రాజెక్ట్ గురించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించే స్టార్ హీరోయిన్ ఎవరనే విషయం పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో హాలీవుడ్ పెద్ద స్టార్స్ నటిస్తారని అంటున్నారు. ‘థోర్’ ఫేమ్ క్రిస్ హెమ్స్‌వర్త్‌తో పాటు మరికొందరు హాలీవుడ్ నటీమణుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఏ విషయం గురించి అఫీషియల్ ప్రకటన రాలేదు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్ గురించి ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను తీసుకున్నారట.
ఈ సినిమాలో హీరోయిన్ కోసం రాజమౌళి చాలా సెర్చ్ చేసాడు. ఇందులో కథానాయికగా ఓ అందమైన మలేషియా నటిని ఎంపిక చేశారు. ఆ తర్వాత మరికొందరు హీరోయిన్లను ఎంపిక చేయాలనుకున్నారట. చివరకు ఈ సినిమాలో మహేష్ జోడిగా ప్రియాంకను ఎంపిక చేశారట. దీంతో ఇప్పుడు మహేష్, ప్రియాంక కాంబోపై మరింత హైప్ నెలకొంది. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్.
ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ రాశారు. యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. ఇది స్టీవెన్ స్పీల్‌బర్గ్ యొక్క ఇండియానా జోన్స్, మిషన్ ఇంపాజిబుల్ వంటి కథను కలిగి ఉంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అమెజాన్ అడవుల్లోనే జరగనుంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 1000 కోట్ల రూపాయలు అని టాక్.
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.