Akhil Akkineni : అక్కినేని యంగ్ హీరో అఖిల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఎంట్రీని యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ ప్లాన్ చేసుకున్నప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆతర్వాత హలో అంటూ ప్రేమకథతో పలకరించిన లాభంలేకుండా పోయింది. ఇక మిస్టర్ మజ్నుగా మారి అలరిస్తాడనుకుంటే అది కూడా దారుణంగా నిరాశపరిచింది. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేశాడు. ఈ సినిమా సక్సెస్ అయినప్పటికీ అక్కినేని ఫ్యాన్స్ కు సరిపోలేదు. ఇక ఇప్పుడు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్ లో నటిస్తున్నాడు అఖిల్. ఈ సినిమాలో అఖిల్ చాలా డిఫరెంట్ గా కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ తో సినిమా చేయడానికి ఏకంగా బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ సిద్ధం అయ్యారని టాక్ వినిపిస్తుంది. కరణ్ జోహార్.. ఇప్పుడు ఈపేరు టాలీవుడ్ లో బాగా వినిపిస్తుంది. ఈ బాలీవుడ్ ప్రొడ్యూసర్ మన సినిమాలను అక్కడి ప్రేక్షకులకు అందిస్తున్నారు. బాహుబలి సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులకు అందించారు కరణ్. ఇప్పుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమాకువన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ఉన్నారు కరణ్.ఇప్పుడు అక్కినేని ప్రిన్స్ అఖిల్ తో కరణ్ జోహార్ సినిమా నిర్మాణం కు సంబంధించిన చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది. బాలీవుడ్ దర్శకుడితో ఒక భారీ సినిమాను కరణ్ జోహార్ నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడట. ఆ సినిమాలో అఖిల్ అక్కినేని హీరోగా నటించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :