Tollywood: అరె.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌కు ఏమైంది? సడెన్‌గా సినిమాలు వదిలేసి సన్యాసినిగా.. ఎవరో గుర్తు పట్టారా?

తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో నటించిన ఈ స్టార్ హీరోయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉన్నట్లుండి సినిమాలకు గుడ్ బై చెప్పేసిన ఈ ముద్దుగుమ్మ సన్యాసినిగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Tollywood: అరె.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌కు ఏమైంది? సడెన్‌గా సినిమాలు వదిలేసి సన్యాసినిగా.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress

Updated on: May 07, 2025 | 11:59 AM

హిందీతో పాటు తెలుగు సినిమాల్లో నటించిన ఈ స్టార్ హీరోయిన్ కెరీర్ కు సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిందీ అందాల తార. అంతేకాదు ఆమెఇకపై ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్నట్లు కూడా స్పష్టం చేసింది. “ప్రస్తుతం నేను నన్ను ఆవిష్కరించుకునే పనిలో బిజీగా ఉన్నాను. శాంతి, అహింస వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నాను. మనం ఇతరుల కోసం ఆలోచించడంలో బిజీగా ఉంటున్నాం, కానీ ఈ సమయంలో మనల్ని మనం మరచిపోతున్నాం. “నా ఉనికి ఉద్దేశ్యం గురించి నాకు తెలియదు. పర్ఫెక్ట్‌గా అన్నింటా నేను ముందుండాలనే రేసులో నన్ను నేను కోల్పోయాను. ఇతరులతో పోల్చుకుంటూ, ఎక్కువ డబ్బు సంపాదించడానికి ప్రయత్నించారు. ఈ రోజు నా దగ్గర డబ్బు, కీర్తి, అన్నీ ఉన్నాయి, కానీ మన శాంతి లేదు. నాకు శాంతి లేకపోతే ఈ డబ్బునంతా నేను ఏమి చేస్తాను? జీవితం అంటే ఏమిటో నేను నిజంగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఈ సినిమా పరిశ్రమ నాకెంతో గుర్తింపు ఇచ్చింది, కానీ అది నాకు స్థిరత్వాన్ని ఇవ్వలేదు. నేను ఇక నటించలేను. నేను వాస్తవంలో జీవించాలనుకుంటున్నాను. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలనుకుంటున్నాను. జీవితం ఎప్పుడు మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు’ అని లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందీ అందాల తార.

ఉత్తర ప్రదేశ్ కు చెందిన సోనియా బన్సాల్ హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటించింది. గేమ్ హండ్రెడ్ క్రోర్ కా అనే మూవీతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిందీ అందాల తార. ఆ తర్వాత నాటీ గ్యాంగ్, డుబ్కీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రెజీనా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన బాలీవుడ్ వెబ్‌సిరీస్ శూర్‌వీర్‌లో సోనియా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో అదరగొట్టింది. ఇక ధీర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఎంట్రీ ఇచ్చింది సోనియా బ‌న్సాల్‌. ఈ సినిమాలో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కుమారుడు లక్ష్య్ హీరోగా నటించాడు. ఆ తర్వాత యస్ బాస్ అనే మూవీలోనూ హీరోయిన్ గా ఎంపికైందీ అందాల తార. అయితే ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు.

ఇవి కూడా చదవండి

తిరుమల శ్రీవారి సేవలో సోనియా బన్సాల్..

కాగా ప్రస్తుతం సోనియా బన్సల్ నిర్ణయం బాలీవుడ్ ను షాక్ కు గురి చేసింది. ఈ ముద్దుగుమ్మ ఇలా సడెన్ గా ఇండస్ట్రీని వదిలేయడానికి కారణాలేంటని విశ్లేషిస్తున్నారు

సినిమా ఈ వెంట్ లో..

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.