నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహా రెడ్డి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ నుంచి విడుదైలన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మరోవైపు ఇటీవల విడుదలైన జై బాలయ్య సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఇందులో బాలయ్యకు జోడిగా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఈ మూవీ తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ హరీష్ పెడి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ డిసెంబర్ 8న జరగునుంది. ఇందుకోసం హైదరాబాద్‌లో జైలు సెట్‌ను నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్టేడ్ నెట్టింట వైరలవుతుంది.
ఈ మూవీలో బాలయ్యకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్బీకే 108 మేకర్స్ సోనాక్షిని సంప్రదించగా… ఆమె ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. ఇక అందుకు మేకర్స్ ఓకే చెప్పడంతో ఆమె ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమాలో బాలయ్య కూతురిగా యంగ్ హీరోయిన్ శ్రీలీల కనిపించనుంది.
అలాగే ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన నటీనటుల గురించి ప్రకటించనున్నారు. ఇక మరోవైపు బాలయ్య.. వీరసింహ రెడ్డి సినిమాతోపాటు.. ప్రముఖ ఓటీటీ ఆహాలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.