AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నప్పటి నుంచి ఆ సమస్యతో బాధపడుతున్నా.. ఏడాదిన్నర కష్టపడి సన్నగా మారనున్న బ్యూటీ..

ప్రస్తుతం సినిమా రంగుల ప్రపంచంలో ఆమె స్టార్ హీరోయిన్. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనదైన ప్రతిభతో జనాలకు దగ్గరయ్యింది. అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ..హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్, ఫిట్నెస్ విషయంలో జనాలను కట్టిపడేస్తుంది

చిన్నప్పటి నుంచి ఆ సమస్యతో బాధపడుతున్నా.. ఏడాదిన్నర కష్టపడి సన్నగా మారనున్న బ్యూటీ..
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 22, 2025 | 9:12 PM

Share

సినిమాల్లో పాత్రల కోసం నటీ నటులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎలాంటి పాత్ర చేయడానికైనా సరే హీరోయిన్స్ కూడా రెడీ అవుతున్నారు. పాత్రకు తగ్గట్టుగా కొంతమంది హీరోయిన్స్ బరువు పెరుగుతారు. మరికొంతమంది స్లిమ్ గా మారిపోతుంటారు. ఇంకొంతమంది హీరోయిన్స్ ఊహించని విధంగా బరువు పెరుగుతూ ఉంటారు. ఇదిలా ఉంటే కొంతమంది హీరోయిన్స్ సినిమాల్లోకి రాక ముందు బొద్దుగా ఉంటారు. అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోతూ ఉంటారు. మనం మాట్లాడుకునే ఓ హీరోయిన్ సినిమాల్లోకి రాక ముందు ఏకంగా 96 కేజీల బరువు ఉండేది. కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె సన్నజాజిలా మారిపోయింది. ఇప్పుడు జీరో సైజ్ లో అదరగొడుతుంది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?

బ్రేకప్‌పై స్పందించిన రష్మిక.. అమ్మాయిలకే ఆ బాధ ఎక్కువగా ఉంటుందన్న నేషనల్ క్రష్

చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఈ అమ్మడు గతంలో తాను ఏకంగా 96 కేజీల వరుకు బరువు ఉండేదాన్ని అని తెలిపింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ సారా అలీఖాన్. బాలీవుడ్ లో ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఓ క్రేజీ హీరోయిన్. ఈ యంగ్ బ్యూటీ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. అందంతో పాటు నటనతోనూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.

ఇవి కూడా చదవండి

బోల్డ్ సీన్స్ దెబ్బకు బ్యాన్ చేశారు.. కట్ చేస్తే భాష మార్చి ఓటీటీలోకి వదిలారు..

ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు సౌత్ లోనూ సినిమాలు చేయాలని ట్రై చేస్తుంది. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో సారా అలీఖాన్ మాట్లాడుతూ.. సినిమాల్లోకి రాకముందు నేను దాదాపు 96 కిలోల బరువు ఉండేదని అని తెలిపింది. అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తనకు పీసీఓడీ (PCOD) సమస్య ఉండేదని, దాని వల్ల విపరీతంగా బరువు పెరిగాను అని తెలిపింది. సినిమాల్లోకి రావడానికి ముందు ఆమె ఒకటిన్నర సంవత్సరాలు కష్టపడి బరువు తగ్గించుకున్నా అని తెలిపింది. ఇప్పుడు ఈ భామ సన్నజాజి నడుముతో తన వయ్యారాలతో కుర్రకారును కట్టిపడేస్తుంది.

తొలి సినిమాకు రూ.10 రెమ్యునరేషన్.. కట్ చేస్తే 300లకు పైగా మూవీస్.. ఇప్పటికే అదే అందం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us