Preity Zinta: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా.. అసలు విషయం చెప్పిన ప్రీతీ జింటా
బాలీవుడ్ నటి ప్రీతీ జింటా భారీ ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు ప్రేక్షకులకి కూడా ఈ అమ్మడు సుపరిచితురాలే.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన రాజకుమారుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది ప్రీతీ. అలాగే వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమంటే ఇదేరా సినిమాలోనూ నటించి మెప్పించింది కానీ ఆతర్వాత తెలుగు సినిమాలకు దూరం అయ్యింది. కేవలం బాలీవుడ్ సినిమాలతోనే బిజీ అయ్యింది ఈ చిన్నది. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో ప్రీతీ 6 […]
బాలీవుడ్ నటి ప్రీతీ జింటా భారీ ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు ప్రేక్షకులకి కూడా ఈ అమ్మడు సుపరిచితురాలే.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన రాజకుమారుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది ప్రీతీ. అలాగే వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమంటే ఇదేరా సినిమాలోనూ నటించి మెప్పించింది కానీ ఆతర్వాత తెలుగు సినిమాలకు దూరం అయ్యింది. కేవలం బాలీవుడ్ సినిమాలతోనే బిజీ అయ్యింది ఈ చిన్నది. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో ప్రీతీ 6 ఏళ్లుగా ఏ సినిమాలోనూ కనిపించలేదు.ఆమె చివరి చిత్రం 2018లో విడుదలైన ‘బ్రదర్ సూపర్‌హిట్’. అయితే ఇప్పుడు ఆమె మరోసారి సినిమాలతో బిజీ కానుంది. ప్రీతీ జింటా వచ్చే ఏడాది ‘లాహోర్ 1947’లో కనిపించబోతోంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉండడానికి గల కారణాన్ని ప్రీతీ స్వయంగా చెప్పింది.
తాజాగా ఇంటర్వ్యూలో ప్రీతి మాట్లాడుతూ.. గత 6 సంవత్సరాలుగా తన వ్యాపారానికి సమయం కేటాయిస్తున్నట్లు తెలిపింది. తన కుటుంబ సభ్యులకు కూడా సమయం ఇవ్వాలని కోరినట్లు తెలిపింది. అలాగే ఆమె మాట్లాడుతూ “నాకు సినిమాలు చేయాలని లేదు. నేను వ్యాపారంపై దృష్టి పెట్టాను. నేను నా వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలనుకున్నాను. హీరోయిన్స్ కు వ్యక్తిగత జీవితం కూడా ఉంటుందని ప్రేక్షకులు మరిచిపోతారు అని చెప్పుకొచ్చింది. అలాగే “నేను ఏ నటుడితో లేదా పరిశ్రమలో ఎవరితోనూ డేటింగ్ చేయలేదు. నాకు నా కుటుంబం ఉంది. జీవితాన్ని గడపడం చాలా అద్భుతమైనది, కానీ మీరు మీ జీవితాన్ని గడపడం మర్చిపోకూడదు. కాబట్టి, నాకు ఒక బిడ్డ కావాలి. అలాగే సినిమా అనేది ఎప్పటికీ ఉంటుంది అని చెప్పుకొచ్చారు.
‘లాహోర్ 1947’ 2025 సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల కావచ్చని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు అమీర్ కూడాసినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన అతిధి పాత్రలో కనిపించనున్నారు. రాజ్‌కుమార్ సంతోషి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. షబానా అజ్మీ, అలీ ఫజల్, అభిమన్యు సింగ్ కూడా ఇందులో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.