Actress: ‘అందుకే నా పెళ్లి హడావిడిగా జరిగిపోయింది’.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన స్టార్ హీరోయిన్

|

Sep 01, 2024 | 5:37 PM

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హడావుడిగా పెళ్లి చేసుకుని అభిమానులను ఆశ్చర్యపరిచిన జంటలు బాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. ఇందుకు చాలా కారణాలున్నాయి. గోప్యత, శుభముహూర్తాలు.. తదితర కారణాలతో ఎన్నో జంటలు అనూహ్యంగా పెళ్లి చేసుకుని తమ అభిమానులను సర్ ప్రైజ్ చేశాయి.

Actress: అందుకే నా పెళ్లి హడావిడిగా జరిగిపోయింది.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన స్టార్ హీరోయిన్
Neha Dhupia Family
Follow us on

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హడావుడిగా పెళ్లి చేసుకుని అభిమానులను ఆశ్చర్యపరిచిన జంటలు బాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. ఇందుకు చాలా కారణాలున్నాయి. గోప్యత, శుభముహూర్తాలు.. ఇలా ఎన్నో జంటలు అనూహ్యంగా పెళ్లి చేసుకుని తమ అభిమానులను సర్ ప్రైజ్ చేశాయి. అయితే పెళ్లికి ముందే గర్భం దాల్చడంతో.. తల్లి తండ్రుల ఒత్తిడితో 72 గంటల్లోనే ప్రియుడితో కలిసి పెళ్లిపీటలెక్కింది ఒక స్టార్ హీరోయిన్. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ అందాల తార నేహా ధూపియా. 2018 మే 10న నేహా ధూపియా, అంగద్ బేడీ గురుద్వారాలో వివాహం చేసుకున్నారు. తాను పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడంతో హడావుడిగా పెళ్లి జరిగిందని నేహా చెప్పుకొచ్చింది. ఈ విషయం తన కుటుంబీకులకు చెప్పగానే వారు ఓ కండిషన్ పెట్టారని ఆమె తెలిపింది. ‘అంగద్ గురించి, నా సంబంధం గురించి మా తల్లిదండ్రులకు చెప్పినప్పుడు, వారు షాక్ అయ్యారు. ఆ తర్వాత నేను గర్భవతినని చెప్పాను. అంతే రెండు రోజులు టైం ఇచ్చి పెళ్లి చేసుకోమన్నారు. అంగద్ నాకు నాలుగేళ్లుగా తెలుసు. కాబట్టి హఠాత్తుగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం నాకు పెద్ద కష్టమనిపించలేదు’ అని నేహా తెలిపింది.

కాగా పెళ్లయిన ఐదు నెలల తర్వాత 2018 నవంబర్‌లో ఓ కుమార్తెకు జన్మనిచ్చింది నేహా. తనకు మెహర్ అని పేరు పెట్టుకున్నారు. తరువాత అక్టోబర్ 3, 2021న, నేహా తన రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. అతని పేరు గురిక్ సింగ్ బేడీ. నేహా 2003లో ‘ఖయామత్’ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ‘జూలీ’, ‘శిఖర్’, ‘చుప్ చుప్ కే’, ‘షీషా’, ‘ఫ్యాన్స్ గయే రే ఒబామా’, ‘దే దానా దాన్’, ‘రే రగిలే’, ‘బాడ్ న్యూస్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

తెలుగు సినిమాల్లోనూ..

అన్నట్లు నేహా ధూపియా కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది. తరుణ్ నిన్నే ఇష్టపడ్డానులో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. రాజశేఖర్ విలన్ లో హీరోయిన్ గా నటించింది. అలాగే బాలకృష్ణ పరమ వీర చక్ర సినిమాలోనూ ఓ కీలక పాత్రలో మెరిసింది. ప్రస్తుతం ఈ అందాల తార సినిమాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అలాగే పోడ్‌కాస్ట్ లో ప్రముఖులను కూడా ఇంటర్వ్యూ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.