
మెగాస్టార్ చిరంజీవి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరు.. ఇప్పుడు విశ్వంభర చిత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బింబిసార వంటి హిట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోయే ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి నెలకొంది. ఇందులో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈమూవీ ఇప్పటికే పూర్తికాగా.. మరో స్పెషల్ సాంగ్ చిత్రీకరించాల్సి ఉందని సమాచారం. ఇప్పటికే ఈ పాట షూటింగ్ కోసం సన్నాహాలు మొదలయ్యాయట. అయితే ఈ సాంగ్ కోసం హీరోయిన్స్ ఎంపికపై కొన్ని రోజులుగా అనేక రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి.
తాజాగా విశ్వంభర మూవీ స్పెషల్ సాంగ్ కోసం ఓ భాలీవుడ్ భామను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఆమె మరెవరో కాదు.. నాగిని సీరియల్ ద్వారా పాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయిన మౌనీ రాయ్. అవును.. విశ్వంభర చిత్రంలో చిరుతో ఆడిపాడేందుకు ఈ ముద్దుగుమ్మను ఖారారు చేసినట్లు టాక్ నడుస్తుంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం ప్రత్యేకంగా సెట్ సైతం రెడీ చేస్తుందట చిత్రయూనిట్. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే ఈ సాంగ్ షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఏ సినిమా సాంగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మంచి మాస్ బీట్ సిద్దం చేసినట్లుగా సమాచారం.
ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ మూవీని ఈ ఏడాది చివర్లోనే తెరపైకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతుందట చిత్రయూనిట్. త్వరలోనే ఈ మూవీ విడుదలపై స్పష్టత రానుంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతోపాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు చిరు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుంది. అలాగే ఇదివరకే పలు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన మౌనీ రాయ్.. ఇప్పుడిప్పుడే హిందీలో పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది.
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..