Hema Malini: ఎర్రటి ఎండలో.. కొడవలి చేతబట్టి వరి పైరు కోసిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్..

ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ ఎక్కువగా రాజకీయాల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే. వీరిలో సీనియర్ బ్యూటీ హేమమాలిని కూడా ఒకరు. మధుర లోక్‌సభ ఎంపీ, నటి హేమమాలిని తాజాగా ఎన్నికల ప్రచారంలో బిజీగా బిజీగా గడుపుతున్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో బీగంగా రైతుల సందడి చేశారు.

Hema Malini: ఎర్రటి ఎండలో.. కొడవలి చేతబట్టి వరి పైరు కోసిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్..
Hema Malini

Updated on: Apr 12, 2024 | 6:47 PM

సినిమా ఇండస్ట్రీకి సంబందించిన వారు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు.. ఇప్పటికే చాలా మంది రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ సారి సినిమా వాళ్లకు ఎంపీ టికెట్స్ కూడా బాగానే ఇచ్చారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ ఎక్కువగా రాజకీయాల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే. వీరిలో సీనియర్ బ్యూటీ హేమమాలిని కూడా ఒకరు. మధుర లోక్‌సభ ఎంపీ, నటి హేమమాలిని తాజాగా ఎన్నికల ప్రచారంలో బిజీగా బిజీగా గడుపుతున్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో బీగంగా రైతుల సందడి చేశారు. హేమమాలిని చేతిలో కొడవలితో పొలానికి వెళ్లి మండుతున్న ఎండలో వారి పైరు కోస్తూ కనిపించారు. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పొలాల్లో రైతులతో కలిసి ఆమె ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు హేమ మాలిని. హఠాత్తుగా హేమమాలినిని చూసి రైతులు కూడా ఆశ్చర్యపోతున్నారు. గతంలో 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ రైతులతో హేమమాలి మాట్లాడారు. ఇప్పుడు కూడా అలానే రైతులతో ఆమె ముచ్చటించారు. హేమ మాలిని ఈ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా పోటీ చేశారు. ఈసారి కూడా బీజేపీ ఆమెకు లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్‌ ఇచ్చింది. హేమ మాలిని మధుర నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచారు.

నేను గత 10 సంవత్సరాలుగా ఈ గ్రామానికి వస్తున్నాను, రైతులతో మాట్లాడే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది” అని హేమ మాలిని ఎక్స్( ట్విట్టర్) ఖాతాలో రాసుకొచ్చారు. అక్కడే ఉన్న రైతు మహిళలతో ఫొటోలు కూడా దిగారు హేమమాలిని. బాలీవుడ్ లో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా రాణించారు హేమమాలిని. ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉంది హేమామాలిని.

హేమామాలిని ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.