- Telugu News Photo Gallery Cinema photos Power Star Pawan Kalyan Next Movie Directors Present Situation due to His busy With Politics Telugu Heroes Photos
Pawan Kalyan: చేస్తున్న ప్రాజెక్ట్ పక్కన పెట్టి మరి న్యూ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేస్తున్న పవన్ డైరెక్టర్స్.
అందరూ ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ సక్సెస్ అయితే బిగ్ ప్రాజెక్ట్ వస్తుందని కలలు కంటారు. కానీ, హరీష్ శంకర్, క్రిష్ పరిస్థితి వేరు. ఆల్రెడీ వాళ్లిద్దరు బిగ్ ప్రాజెక్టులను అప్పుడెప్పుడో స్టార్ట్ చేశారు. గ్యాప్ దొరికింది కదా.. అని ఇంకో ప్రాజెక్టు చేస్తున్నారు. బట్.. చేస్తున్న ప్రాజెక్ట్ మంచి సక్సెస్ కావాలి.. అప్పుడే ఆల్రెడీ మొదలుపెట్టిన బిగ్ ప్రాజెక్టులకు క్రేజ్ ఉంటుంది.! అబ్బబ్బబ్బా.! ఏంటీ ప్రాజెక్టుల సంగతి అంటారా.?
Updated on: Apr 12, 2024 | 8:37 PM

అందరూ ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ సక్సెస్ అయితే బిగ్ ప్రాజెక్ట్ వస్తుందని కలలు కంటారు. కానీ, హరీష్ శంకర్, క్రిష్ పరిస్థితి వేరు. ఆల్రెడీ వాళ్లిద్దరు బిగ్ ప్రాజెక్టులను అప్పుడెప్పుడో స్టార్ట్ చేశారు. గ్యాప్ దొరికింది కదా.. అని ఇంకో ప్రాజెక్టు చేస్తున్నారు.

బట్.. చేస్తున్న ప్రాజెక్ట్ మంచి సక్సెస్ కావాలి.. అప్పుడే ఆల్రెడీ మొదలుపెట్టిన బిగ్ ప్రాజెక్టులకు క్రేజ్ ఉంటుంది.! అబ్బబ్బబ్బా.! ఏంటీ ప్రాజెక్టుల సంగతి అంటారా.? పవర్ స్టార్ హీరోగా ఉస్తాద్ భగత్‌సింగ్‌ని హరీష్ శంకర్ మొదలుపెట్టినప్పుడు క్రేజ్ మామూలుగా లేదు.

కానీ పవన్ లేటెస్ట్ ఎనౌన్స్‌మెంట్‌తో ఆ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. అసలు సెప్టెంబర్‌లోపు పవన్ సెట్‌కి రానని చెప్పటంతో ఓజీ ఇప్పట్లో లేనట్టే అని డిసైడ్ అయ్యారు ఫ్యాన్స్.

ఆ సక్సెస్ సౌండ్, ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వినిపించాలి.. ఇదీ ఇప్పుడు హరీష్ నుంచి పవర్ అండ్ మాస్ మహరాజ్‌ఫ్యాన్స్ కోరుకుంటున్నది. సేమ్ హరీష్ శంకర్‌లాంటి పరిస్థితే కెప్టెన్ క్రిష్‌ది కూడా. పవన్ కల్యాణ్ కెరీర్‌లో ప్యాన్ ఇండియా సినిమా అంటూ స్టార్ట్ చేశారు హరిహర వీరమల్లుని.

ఆ ఫొటోలు, ప్రమోషనల్ కంటెంట్.. సినిమా మీద అమాంతం అంచనాలు పెంచేసింది. పవన్‌కి పక్కా ప్యాన్ ఇండియన్ మూవీ పడిందని అంతా ఫిక్స్ అయిపోయారు. హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడటానికి కూడా పవర్‌స్టార్ పొలిటికల్ కమిట్‌మెంట్సే కారణం.

పవన్ కల్యాణ్ కోసం చాన్నాళ్లు వెయిట్ చేసిన క్రిష్.. ఈ మధ్యనే అనుష్కతో ఓ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాను మొదలుపెట్టారు. అసలే వేదంతో సక్సెస్ చూసిన కాంబో కావడంతో, క్రిష్ - అనుష్క మూవీ మీద గట్టి హోప్స్ ఉన్నాయి జనాలకు. ఈ సినిమా సక్సెస్ రేంజ్ హరిహరవీరమల్లు సెట్స్ లో కనిపించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు క్రిష్.

పవన్ డైరక్టర్లలో.. డబుల్ సక్సెస్ చూడాలన్న టెన్షన్ సుజీత్‌కి కాస్త తక్కువే. మిగిలిన ఇద్దరికీ అదర్ ప్రాజెక్టులున్నాయి. సుజిత్ మాత్రం ప్రస్తుతం ఓజీ మీదే ఉన్నారు. ఓజీ పూర్తయ్యాక నేచురల్ స్టార్‌ని డైరక్ట్ చేయాలి. సో.. ముందయితే ఓజీని సక్సెస్ చేయాలన్న గోల్‌తో సాగుతున్నారు సుజిత్.




