Robotic Elephant: మఠానికి రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చిన స్టార్ హీరో.. ధర ఎంతో తెలుసా?

ఇటీవల ఆలయాలకు నిజమైన ఏనుగు బదులు రోబోటిక్ ఏనుగులను విరాళంగా ఇస్తున్నారు దాతలు. ఇందుకు చాలా కారణాలున్నాయి. ఆ మధ్యన బాలీవుడ్ అందాల తార శిల్పా శెట్టి కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని రంభపురి మఠానికి ఇలాగే రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చారు.

Robotic Elephant: మఠానికి రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చిన స్టార్ హీరో.. ధర ఎంతో తెలుసా?
Robotic Elephant

Updated on: Feb 24, 2025 | 9:39 AM

 

కర్ణాటకలోని చన్నగిరి తాలూకాలోని ధావణగేరే శిలామఠం లోకి ఒక రోబోటిక్ ఏనుగు వచ్చింది . ఆదివారం (ఫిబ్రవరి 24) శ్రీ మఠానికి చేరుకున్న ఏనుగుకు స్వామీజీ ఘన స్వాగతం పలికారు. ఆ రోబోటిక్ ఏనుగుకు ఉమామహేశ్వర్ అని పేరు పెట్టారు. గ్రామస్తులందరూ మేళ తాళాలతో రోబోటిక్ ఏనుగును ఊరేగించారు. ఇక భక్తులు, స్థానికులు రోబోటిక్ ఏనుగు పక్కన నిలబడి ఫోటోలు తీగేందుకు పోటీ పడ్డారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చారు. ముంబైకి చెందిన కుపా & పెటా ఇండియా సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఈ ఏనుగును మఠానికి అందించారు. ఈ ఫౌండేషన్ నుంచి ఇప్పటికే పలు ఆలయాలు, మఠాలకు రోబోటిక్ ఏనుగులు చేరాయి. థాకర్సే సంస్థ ఇందుకు నిధులు సమకూరుస్తోంది.  ఒక రోబోటిక్ ఏనుగు ధర సుమారు 17 లక్షల రూపాయలని తెలుస్తోంది. కాగా ఏనుగును ట్రాలీపై ఉంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. రిమోట్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేస్తుంటారు.అంటే కళ్లు మూసుకోవడం, చెవులు ఊపడం, తొండంతో భక్తులను ఆశీర్వదించడం.. ఇలా అన్ని రిమోట్ కంట్రోల్ ద్వారానే జరుగుతాయి.

ఇవి కూడా చదవండి

ఇటీవల కాలంలో ఏనుగులు జనంపై దాడి చేస్తున్నాయి. వాటి ఉక్కు పాదాలతో భక్తులను తొక్కేసి చంపేస్తున్నాయి. మావటీల మాట కూడా వినట్లేదు . ఈ క్రమంలోనే ఇప్పుడు చాలా మంది దాతలు ఆలయాలకు నిజమైన ఏనుగులను బదులు రోబోటిక్ ఏనుగులను విరాళంగా ఇస్తున్నారు. గుడి కార్యక్రమాలకు, ఊరేగింపులకు దీన్ని ఉపయోగించడం వల్ల ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఇక రోబోటిక్ ఏనుగుల కోసం ఎలాంటి ఖర్చు ఉండదు. ఈ కారణంగానే ఇప్పుడు రోబోటిక్ ఏనుగు దాతల సంఖ్య కూడా బాగా పెరిగింది.

పెటా ఇండియా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.