Shah Rukh Khan: రామ్ చరణ్ పై బాలీవుడ్ బాద్ షా క్రేజీ కామెంట్స్.. ఏమన్నారంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తదుపరి చిత్రం పఠాన్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన షారుఖ్.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

Shah Rukh Khan: రామ్ చరణ్ పై బాలీవుడ్ బాద్ షా క్రేజీ కామెంట్స్.. ఏమన్నారంటే..
Shahrukh Khan, Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 18, 2022 | 1:22 PM

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. జక్కన్న తెరకెక్కించిన ఈ సినిమాలో చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రానికి విదేశీయులు.. హాలీవుడ్ డైరెక్టర్స్ సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమాతో చరణ్ పాపులారిటీ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఇక తమ హీరోకు వస్తున్న క్రేజ్ చూసి చరణ్ అభిమానులు సైతం ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం చెర్రీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలో నటిస్తు్న్నారు. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని.. అందులో ఒకటి ముఖ్యమంత్రి పాత్ర ఉండనున్నట్లు గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమానే కాకుండా.. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలోనూ చరణ్ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తదుపరి చిత్రం పఠాన్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన షారుఖ్.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ గురించి ఒక్కమాటలో చెప్పాలని చెర్రీ ఫ్యాన్ ఒకరు ట్వీట్ చేయగా.. బాద్ షా స్పందిస్తూ.. “చరణ్ నా ఓల్డ్ ఫ్రెండ్. మా పిల్లలకు తనంటే చాలా ఇష్టం ” అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం షారుఖ్ చేసిన ట్వీట్ వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

అలాగే తెలుగు ప్రేక్షకులు సినిమాలను అమితంగా ఇష్టపడతారని.. వారికి సినిమా పరిజ్ఞానం ఎక్కువ అంటూ షారుఖ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా చేస్తున్నారు. ఇందులో లేడీ సూపర్ స్టా్ర్ నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.