ఇది సార్‌.. పుష్పగాడి రేంజ్‌ 

Narender Vaitla

08 November 2024

పుష్ప2 చిత్రం విడుదలకు కౌంట్ డౌంట్ మొదలైంది. మరో 27 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. కాగా సినిమా విడుదలకు ముందే పుష్ప సీక్వెల్ అరాచకం మొదలైంది.

నెలరోజుల ముందే పుష్ప సీక్వెల్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మొదలయ్యాయి. విదేశాల్లో అడ్వాన్స్‌ బుకింగ్స్ మొదలుకాగా టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

నార్త్‌ అమెరికాలో పుష్ప2 కి సంబంధించి ఒకే రోజు ఏకంగా 15000 టికెట్లు అమ్ముడై సరికొత్త రికార్డును తిరగరాసినట్లు గణంకాలు చెబుతున్నాయి.

మొత్తం 2750 షోలకు బుకింగ్స్ ఓపెన్‌ చేయగా.. అన్ని షోలు హౌస్‌ ఫుల్‌ అయ్యాయి. దీనిబట్టే పుష్ప 2పై ప్రేక్షకులు ఎంత క్యూరియాసిటీతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

కేవలం అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ద్వారానే పుష్ప ఏకంగా రూ. 3 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. దీంతో పుష్ప2 ఓపెనింగ్స్‌ ఓ రేంజ్‌లో ఉండడం ఖాయమని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే పుష్ప2 ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఏకంగా రూ. 1000 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది. థియేటరికల్‌ రైట్స్ రూ. 600 కోట్లు కాగా నాన్‌ థియేట్రికల్ రైట్స్ రూ. 400 కోట్లకు అమ్ముడుపోయాయి.

ఇక ఓటీటీ హక్కుల విషయంలో కూడా పుష్ప 2 సరికొత్త చరిత్రను తిరగరాసినట్లు తెలుస్తోంది. నెట్‌ ఫ్లిక్స్‌ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను రూ. 275 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రచారం. 

 పుష్ప 2 సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం స్పెషల్‌ సాంగ్ షూటింగ్ హైదరాబాద్‌లో జరగుతోందని సమాచారం. ఇందులో శ్రీలీల నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.