Pushpa 2: ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్ బద్దలు అంతే..
Pushpa 2 The Rule First Day Collection: అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న చిత్రం పుష్ఫ2. సుమారు మూడేళ్ల క్రితం సైలెంట్ గా విడుదలై సంచలనాలు సృష్టించిన పుష్ఫ సినిమాకు సీక్వెల్ ఇది. మొదటి పార్ట్ కు దర్శకత్వం వహించిన సుకుమార్ సీక్వెల్ ను తెరకెక్కించారు. డిసెంబర్ ఈ పాన్ ఇండియా మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
పుష్ఫ2.. ఈ క్రేజీ సీక్వెల్ మూవీ మొదటి రోజే బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం తొలిరోజు రూ.270 కోట్ల వసూళ్లు రాబట్టుతుందని బాక్సాఫీస్ పండితులు లెక్కలు వేస్తున్నారు. ప్రముఖ ఫిల్మ్ వెబ్‌సైట్ సాక్నిక్ . ‘పుష్ప2 : రూల్’ సినిమా తొలిరోజు ఎంత వసూళ్లు రాబట్టగలదో అంచనా వేసింది. ఈ సినిమా ఇండియాలో 200 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని, విదేశాల నుండి 70 కోట్ల రూపాయలు ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అలా చేస్తే పుష్ఫ 2 రోజు మొదటి రోజు వసూళ్లు 270 కోట్ల రూపాయల దాటుతాయంటోంది.
భారతదేశంలోని ఏ ప్రాంతం నుండి ఎన్ని కోట్ల రూపాయలు వస్తాయనే సమాచారం సాక్నిక్ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి 85 కోట్లు, కర్ణాటక నుంచి 20 కోట్లు, తమిళనాడు రాష్ట్రం నుంచి 12 కోట్లు, కేరళ నుంచి 8 కోట్ల రూపాయలు వస్తాయట. ఇక ఇండియాలోని మిగతా ప్రాంతాల నుంచి 75 కోట్ల వసూళ్లు వస్తాయని అంచనా వేసింది. టోటల్ గా ఇండియాలో ఈ మూవీ 200 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని నివేదించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్ఫోన్ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
కత్తితో కారు దిగిన మహిళ.. కారు పైకి కోడిగుడ్లు విసిరిన దుండగులు
