గర్వంగా చెప్తున్నా నేను తెలుగు సినిమా వాడినే.. అమితాబ్ మాటలకు దద్దరిల్లిన ఆడిటోరియం

|

Oct 29, 2024 | 11:14 AM

అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

గర్వంగా చెప్తున్నా నేను తెలుగు సినిమా వాడినే.. అమితాబ్ మాటలకు దద్దరిల్లిన ఆడిటోరియం
Amitabh Bachchan
Follow us on

అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు ప్రదానోత్సవ వేడుక హైదరాబాద్ లో వైభవంగా జరిగింది.  అక్టోబర్ 28న ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్‌ జాతీయ అవార్డును ప్రధానం చేశారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకున్నారు. ఈ వేడుకలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ తెలుగువారు గర్వించే కామెంట్స్ చేశారు. అమితాబ్ బచ్చన్ తెలుగులోనూ నటించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో అమితాబ్ కీలక పాత్రలో కనిపించారు. అలాగే రీసెంట్ గా వచ్చిన ప్రభాస్ కల్కి సినిమాలోనూ అమితాబ్ నటించి మెప్పించారు.

ఈ అవార్డుల వేడుకలో చిరంజీవి తన తల్లి అంజనా దేవిని అమితాబ్ కు పరిచయం చేశారు. ఆయన మెగాస్టార్ తల్లి పాదాలకు నమస్కారం చేశారు. అంత పెద్ద హీరో అయ్యి ఉండి కూడా మెగాస్టార్ తల్లి పాదాలకు నమస్కారం చేయడం చాలా గ్రేట్ అని నెటిజన్స్ కొనియాడుతున్నారు. ఆతర్వాత ఈ అవార్డు ప్రదానోత్సవ వేడుకలో అమితాబ్ మాట్లాడుతూ.. నేను గర్వంగా చెప్తున్నాను.. నేను తెలుగు సినిమా సభ్యుడిని. నేను తెలుగు సినిమా వాడిని అని గర్వంగా చెప్పగలను అని అన్నారు. నాగార్జున, చిరంజీవి, నాగ్ అశ్విన్ సినిమాల్లో నేను నటించాను. నన్ను మీ సినిమాల్లో తీసుకోవడం మర్చిపోకండి అని అన్నారు అమితాబ్. అమితాబ్ మాట్లాడుతుంటే ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మారుమ్రోగింది. అమితాబ్ తన మాటలతో తెలుగువాళ్లు కలర్ ఎగరేసేలా చేశారు.

ఇవి కూడా చదవండి

అనంతరం మాట్లాడిన చిరంజీవి ఉద్వేగానికి లోనయ్యారు. “తెలుగులో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఓ నానుడి ఉంది. కానీ సినిమా పరిశ్రమలో నేను తొలుత రచ్చ గెలిచాను. నా ఇల్లు అనుకునే పరిశ్రమలో నాకు ఆ అవకాశం టాలీవుడ్‌ వజ్రోత్సవాల సమయంలో వచ్చింది. అప్పుడు నాకు లెజండరీ పురస్కారం ప్రదానం చేశారు. ఆ సమయంలో చాలా ఆనందమేసి ధన్యుణ్ని అనుకున్నా. కానీ ఆ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కొందరు హర్షించని సమయంలో ఆ పురస్కారాన్ని తీసుకోవడం సముచితం అనిపించలేదు. అందుకే దాన్ని క్యాప్సుల్ బాక్సులో వేశా. ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ది గ్రేట్ ఏఎన్నార్‌ అవార్డును.. ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారి చేతులు మీదగా అందుకున్న రోజున ఇప్పుడు అనిపిస్తోంది.. నేను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను అని అంటూ చిరంజీవి ఎమోషనల్‌గా మాట్లాడారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.