AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pallavi Prashanth: 10 ఎకరాల మొక్కజొన్న పంట బూడిద పాలు.. నిర్మల్ జిల్లా రైతుల కోసం పల్లవి ప్రశాంత్ ఏం చేశాడో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అలియాస్ రైతు బిడ్డ గొప్ప మనసును చాటుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా చేతికొచ్చిన పంటను కోల్పోయి రోడ్డున పడ్డ అన్నదాతలకు అండగా నిలిచారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Pallavi Prashanth: 10 ఎకరాల మొక్కజొన్న పంట బూడిద పాలు.. నిర్మల్ జిల్లా రైతుల కోసం పల్లవి ప్రశాంత్ ఏం చేశాడో తెలుసా?
Bigg Boss Telugu Winner Pallavi Prashanth
Basha Shek
|

Updated on: May 05, 2026 | 11:28 AM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రైతు బిడ్డ ట్యాగ్ తో అందరికీ సుపరిచితమైన ఈ తెలంగాణ కుర్రాడు రైతులకు తన వంతు సహాయం చేస్తున్నాడు. తాజాగా మరోసారి గొప్ప మనసును చాటుకున్నాడు ప్రశాంత్. ఇటీవల నిర్మల్ జిల్లాలోని పెంబి మండలంలో గోసుకుల రాములు, కన్నె మల్లేష్ అనే ఇద్దరు రైతులు తమ కున్న 10 ఎకరాల పొలంలో మొక్కజొన్నను సాగు చేశారు. పంట కూడా చేతికి వచ్చింది. ఇక కోతలు మొదలు పెట్టేందుకు కూడా రెడీ అయ్యారు. అయితే ఈ సమయంలో విద్యుత్ తీగలు తగిలి షార్ట్ సర్క్యూట్ కారణంగా 10 ఎకరాల మొక్కజొన్న పంట మొత్తం కాలి బూడిదైపోయింది. నెలల పాటు సాగు చేసిన పంట చేతికొచ్చే ముందు బూడిద పాలు కావడంతో రైతులు విలవిల్లాడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దేశానికి అన్నం పెట్టే రైతులు ఏడుస్తున్నటువంటి వీడియోలు అందరినీ కలిచివేశాయి. దీంతో ప్రభుత్వం కూడా ఈ ఘటనపై స్పందించింది. పంటను కోల్పోయిన రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కూడా ఈ ఘటనపై స్పందించారు. రైతులకు అండగా నిలిచారు. తన మనుషులను అక్కడికి పంపించి వారికి తనవంతు ఆర్థిక సహాయం అందజేశారు.

ప్రస్తుతం తాను మాలలో ఉన్నానని, అందుకే అక్కడికి వెళ్లలేకపోయారని మాల తీసిన వెంటనే స్వయంగా వెళ్లి రైతులను కలుస్తాను అంటూ వీడియో కాల్స్ ద్వారా సదరు రైతులతో మాట్లాడి వారికి ధైర్యం కల్పించాడు పల్లవి ప్రశాంత్. ‘ నిర్మల్ జిల్లా, పెంబి మండలంలో విద్యుత్ తీగల షార్ట్ సర్క్యూట్ వల్ల కోతకు వచ్చిన 10 ఎకరాల మొక్కజొన్న పంట కాలిపోయింది. ఒక రైతు పంట కోసం ఎంత కష్టపడతాడో మాటల్లో చెప్పలేం. పగలు రాత్రి తేడా లేకుండా చెమటోడ్చి పండించిన పంట కళ్లముందే కాలిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. రైతు నవ్వితేనే దేశం నవ్వుతుంది… కానీ ఇలాంటి ఘటనలు రైతు గుండెను ముక్కలు చేస్తాయి. ఈ బాధ చూసి నా వంతుగా కొంత సహాయం చేశాను. మనకు సాధ్యమైనంత వరకు రైతులకు అండగా నిలుద్దాం’ అని తన అభిమానులకు పిలుపు నిచ్చాడు పల్లవి ప్రశాంత్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర