Sohel : ఆ యంగ్ హీరోకి ఫోన్ చేస్తే పేరు చెప్పాగానే కట్ చేశాడు.. ఎమోషనలైన సోహెల్
సోహెల్ మాత్రం హీరోగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటున్న సోహెల్ ఇటీవలే మిస్టర్ ప్రగ్నెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు బూట్ కట్ బాలరాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో ద్వారా చాలా మంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు వారిలో సోహెల్ ఒకరు. బిగ్ బాస్ కంటెస్టెంట్లలో హీరోగా ఎదగాలని కోరిక ఉందని చాలా మంది చెప్పుకొచ్చారు. కానీ అలా హీరోలుగా మారిన వారు చాలా తక్కువ. సోహెల్ మాత్రం హీరోగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటున్న సోహెల్ ఇటీవలే మిస్టర్ ప్రగ్నెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు బూట్ కట్ బాలరాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈ ఈవెంట్‌లో సోహెల్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
సినిమాలు చేసినా, వెబ్ సిరీస్‌లు చేసినా,షార్ట్ ఫిలిం, రియాలిటీ షో చేసినా, చేసినా.. ప్రతిదానికి రెండే రెండు కారణాలుంటాయి ఒకటి మనం బ్రతకడానికి రెండోది మంచి గుర్తింపు కోసం అని చెప్పుకొచ్చాడు సోహెల్. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ షార్ట్ ఫిలిం లో నటించాను. ఆతర్వాత కొత్తబంగారు లోకం సినిమాలో చిన్న రోల్ లో కనిపించాను అలా ఒకొక్క మెట్టు ఎక్కుతూ నేను ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను అని అన్నాడు సోహెల్.
అలాగే సంక్రాంతి రోజు ఓ యంగ్ హీరోకు నేను ఫోన్ చేశాను.. అతను ఫోన్ ఎత్తగానే నేను సోహెల్ అని పేరు చెప్పగానే ఫోన్ కట్ చేశాడు. ఆతర్వాత తిరిగి చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అన్నాడు వాళ్లంతా స్టార్ హీరోలు.. కానీ వెంకటేష్ గారికి మెసేజ్ పెడితే వెంటనే రిప్లే ఇచ్చారు. నాకు అల్ ది బెస్ట్ చెప్తూ.. ఓ వాయిస్ మెసేజ్ పంపారు దాంతో నాకు చాలా సంతోషం వేసింది. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. మనం ఎప్పుడూ ఒకేలా ఉందాం..ఒకరికొక్కరు సపోర్ట్ చేసుకుందాం.. నా లాంటి వాళ్లు అడిగినప్పుడు ఒక మాట సాయం చేయండి చాలు అని ఎమోషనల్ అయ్యాడు సోహెల్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి