Syed Sohel: ‘ఇంట్లో వాళ్లని తిడితే ఊరుకోవాలా ?.. నేను ఏం మాట్లాడినా నెగిటివ్‏గా తీసుకుంటున్నారు’.. బిగ్‏బాస్ సోహైల్ కామెంట్స్..

ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం లక్కీ లక్ష్మణ్. ఇందులో సోహైల్ సరసన మోక్ష హీరోయిన్ గా నటిస్తోంది. ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు.

Syed Sohel: ఇంట్లో వాళ్లని తిడితే ఊరుకోవాలా ?.. నేను ఏం మాట్లాడినా నెగిటివ్‏గా తీసుకుంటున్నారు.. బిగ్‏బాస్ సోహైల్ కామెంట్స్..
Sohel

Updated on: Dec 30, 2022 | 9:41 AM

బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సోహైల్. అంతుకుముందు సీరియల్స్ ద్వారా బుల్లితెరపై సందడి చేసిన.. ఈ రియాల్టీ షో ద్వారా మాత్రం ఏకంగా హీరోగా మారిపోయారు. బిగ్ బాస్ అనంతరం వరుస ఆఫర్లు అందుకున్నారు సోహైల్. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం లక్కీ లక్ష్మణ్. ఇందులో సోహైల్ సరసన మోక్ష హీరోయిన్ గా నటిస్తోంది. ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 30న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్బంగా హీరో సోహైల్ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. ఈ క్రమంలో గతంలో తాను మాట్లాడిన మాటలను నెగిటివ్ గా తీసుకుంటున్నారని.. తన ఇంట్లో వాళ్లను తిడితే ఎలా ఊరుకుంటానంటూ చెప్పుకొచ్చారు.

సోహైల్ మాట్లాడుతూ.. ” వ‌ర్క్ ప‌రంగా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక ప‌ర్స‌న‌ల్‌గా చూస్తే రెస్ట్ ఉండ‌టం లేదు. ఇక్క‌డ రెండు విష‌యాలున్నాయి. కామ‌న్ మ్యాన్‌గా ఉన్నప్పుడు ప‌రిస్థితులు ఒక‌లా ఉంటాయి. అదే బిగ్‌బాస్‌, సినిమానో ఎదో ఒక చిన్న‌దో, పెద్ద‌తో సెల‌బ్రిటీ స్టేట‌స్ వచ్చిన‌ప్పుడు దాన్ని హ్యాండిల్ చేయ‌టం క‌ష్ట‌మైపోతుంది. ఇక ప్రొషెష‌న‌ల్‌గా చూస్తుంటే సినిమాల ప‌రంగా, కంటెంట్ ప‌రంగా పాటలు, టీజ‌ర్‌, ట్రైల‌ర్ విడుద‌ల‌వైతే చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ప‌ర్స‌న‌ల్‌గా అయితే మీడియాతో ఎలా మాట్లాడాలి.. కెమెరా ముందు ఎలా ఉండాలనే విష‌యాల‌ను కాలిక్యులేట్ చేసుకోవాల్సి వ‌స్తుంది. కానీ నేను ఒరిజిన‌ల్‌గా ఉండాల‌ని అనుకుంటున్నాను. ఇక్క‌డ కూడా యాక్ట్ చేయాలంటే నా వ‌ల్ల కావ‌టం లేదు. అదొక్క‌టే నాకు మైన‌స్ అవుతుంది నాకు. కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నాను. కానీ ఇంట‌ర్వ్యూస్‌లో మాట్లాడే సంద‌ర్భంలో లోప‌ల ఒక‌టి పెట్టుకుని బ‌య‌ట ఒక‌టి మాట్లాడ‌టం నాకు రావ‌టం లేదు.

ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడితే కొంత మంది నెగటివ్‌గా తీసుకుంటున్నారు. 100 మందిలో 20 మంది నెగిటివ్‌గా తీసుకుంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు కామెంట్స్ చూసుకుని డిలీట్ చేస్తున్నాను. ఆ స‌మ‌యంలో కొంత మంది నా ఇంట్లో వాళ్ల‌ని టార్గెట్ చేస్తున్న‌ట్లు మెసేజెస్ పెడుతున్నారు. మేము కూడా మ‌నుషుల‌మే మాకు కూడా ఎమోష‌న్స్ ఉంటాయి. నేను నా కోపాన్ని బ‌య‌ట‌కు చూపించేస్తుంటాను. ఇంట్లోని వాళ్ల‌ని కామెంట్ చేసే కామ‌న్ పీపుల్ ఎవ‌రైనా స‌రే! ఇచ్చిప‌డేసుడే. అదే విష‌యాన్ని నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేశాను. కానీ దాన్ని కొంద‌రు మ‌రోలా తీసుకున్నారు. కోట్ల రూపాయ‌లు పెట్టి సినిమా తీసిన‌ప్పుడు కింద కామెంట్స్ పాజిటివ్‌గా వ‌స్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. కావాల‌నే నెగిటివ్ కామెంట్ పెడితే బాగోదు.

ఇవి కూడా చదవండి

అలాగే సోష‌ల్ మీడియాలో నెగిటివిటీ ఎందుకు ఉంటుందో అర్థం కావ‌టం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు ఇండియా గ్లిజ్డ్స్ వెబ్ సైట్‌లో నా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటల్లో నా స‌క్సెస్‌కు మా నాన్నే కార‌ణం అని పెడితే దానికి 500 వ్యూస్ మాత్ర‌మే వ‌చ్చాయి. అదే ఇచ్చిప‌డేస్తా కొడ‌క‌ల్లారా అని అన్న మాట‌ల‌కు ల‌క్షా ఇర‌వై వేలు వ్యూస్ 700 కామెంట్స్‌, షేర్స్ వ‌చ్చాయి. చిరంజీవిగారి వాల్తేరు వీర‌య్య వీడియోల‌కు 10..20..40 వేలు వ్యూస్ ఉన్నాయి. దీనికి మాత్రం ల‌క్షా ఇర‌వై వేలున్నాయి. అస‌లు నెగిటివ్ చూడాల‌ని ఎంతగా చూస్తున్నారో అర్థం కావటం లేదు. మ‌న ఇంట్లోని వాళ్ల‌ను ఎవ‌రైనా తిడితే మ‌నం ఎలా రియాక్ట్ అవుతామో అలా రియాక్ట్ అయ్యాను.. అలా అవ‌టం నాకు ప్రాబ్లెమ్ అవుతుంది. ఇక కెమెరా ముందు కూడా న‌టించ‌టం ప్రాక్టీస్ చేయాలి” అంటూ చెప్పుకొచ్చారు.