Rathika Rose: గ్యాప్ ఇచ్చినా.. గట్టి ఛాన్స్ కొట్టేసిందిగా..!! ఆ స్టార్ హీరో సినిమాలో రతికా రోజ్
సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన రతికా రోజ్. బిగ్ బాస్ హౌస్ లో హడావిడి అంతా ఇంతా కాదు.. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఈ చిన్నది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తో కోల్జ్ గా ఉంటూ అందరి దృష్టి తన పై పడేలా చేసింది. ప్రశాంత్ ఎక్కడుంటే అక్కడే కనిపించింది రతికా.. ఆతర్వాత రైతు బిడ్డకు రివర్స్ అయ్యింది. అతన్ని విమర్శించడం మొదలు పెట్టింది.
![Rathika Rose: గ్యాప్ ఇచ్చినా.. గట్టి ఛాన్స్ కొట్టేసిందిగా..!! ఆ స్టార్ హీరో సినిమాలో రతికా రోజ్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/04/rathika-rose-1.jpg?w=1280)
బిగ్ బాస్ సీజన్ 7లో పాటిస్పెట్ చేసిన అందరూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరిలో చాలా మంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వారిలో రతికా రోజ్ ఒకరు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన రతికా రోజ్. బిగ్ బాస్ హౌస్ లో హడావిడి అంతా ఇంతా కాదు.. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఈ చిన్నది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తో కోల్జ్ గా ఉంటూ అందరి దృష్టి తన పై పడేలా చేసింది. ప్రశాంత్ ఎక్కడుంటే అక్కడే కనిపించింది రతికా.. ఆతర్వాత రైతు బిడ్డకు రివర్స్ అయ్యింది. అతన్ని విమర్శించడం మొదలు పెట్టింది. అంతే కాదు హౌస్ లో ఉన్న వారందరితో గొడవలు పెట్టుకొని కంటెంట్ బాగానే ఇచ్చింది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి.. ఆతర్వాత ఓటింగ్ తో తిరిగి వచ్చి హౌస్ లో రచ్చ రచ్చ చేసింది.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన రతికాకు సినిమా అవకాశాలు క్యూకట్టాయి . ఈ చిన్నది దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఇంత వరకు ఆ సినిమా గురించి ఎలాంటి ఊసు లేదు. అయితే ఇప్పుడు రతికా రోజ్ కు ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు రతికా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. త్వరలోనే ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తుందని తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు దళపతి విజయ్ . అవును విజయ్ సినిమాలో రతికా రోజ్ కు అవకాశం వచ్చిందని తెలుస్తోంది. అంతే కాదు మరో హీరో విజయ్ సేతుపతితో కూడా నటిస్తున్నా అని తెలిపింది రతికా రోజ్. దాంతో రతికా రోజ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రతికా రోజ్ ఇన్ స్టా
View this post on Instagram
రతికా రోజ్ ఇన్ స్టా
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.