AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊర్లో ఇల్లు అమ్మి హైదరాబాద్‌లో 70లక్షలుపెట్టి షాప్ పెట్టా.. ఓ నిర్మాత ఛాన్స్ ఇస్తానని చెప్పి..

బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. అప్పటివరకు పెద్దగా క్రేజ్ లేని వారు కూడా బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతమంది సినిమాల్లో అవకాశాలు తెచ్చుకున్నారు. అలాగే మరికొంతమంది సీరియల్స్ లో బిజీగా ఉన్నారు.

ఊర్లో ఇల్లు అమ్మి హైదరాబాద్‌లో 70లక్షలుపెట్టి షాప్ పెట్టా.. ఓ నిర్మాత ఛాన్స్ ఇస్తానని చెప్పి..
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 31, 2026 | 1:12 PM

Share

బిగ్ బాస్ ద్వారా చాలా మంది ముద్దుగుమ్మలు పాపులర్ అయ్యారు. కొందరు సినిమాల్లో అవకాశాలు సొంతం చేసుకుంటుంటే మరికొంతమంది మాత్రం సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటూ రాణిస్తున్నారు. కొంతమంది మాత్రం కనిపించకుండాపోయారు. కొంతమంది వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. చాలా మంది తమ జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను, అవమానాలను, వచ్చిన అవకాశాలను అన్ని పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ అందాల భామ తన జీవితంలో ఎదురైనా కష్టాలను, సమస్యలను పంచుకుంది. ఆమె ఎవరో తెలుసా.? బిగ్‌బాస్ నైనిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్లను పంచుకున్నారు. నైనిక హైదరాబాద్‌కు మారిన తర్వాత, ఆమె తల్లి కూడా నైనికతోనే ఉండాలని నిర్ణయించుకున్నారట.

ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి

ఈ క్రమంలో, కేవలం నైనిక కోసం మాత్రమే కాకుండా, తన తల్లికి కూడా వ్యక్తిగతంగా ఏదైనా పని ఉండాలనే కోరికతో ఒక స్టూడియో (సలోన్) ప్రారంభించాలనే ఆలోచన వచ్చిందని నైనిక తెలిపింది. ఆమె తల్లికి ఎల్లప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండటం అలవాటని, అందుకే ఈ వ్యాపార నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ప్రారంభంలో, ఒక ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనుకోకుండా, నైనిక హైదరాబాద్‌కు మారాలని అనుకున్న సమయంలోనే ఆ ఫ్రాంచైజీ అప్రూవ్ అయిందని, అది క్రమంగా ఇంత పెద్ద లగ్జరీ సలోన్‌గా మారిందని తెలిపింది. ఈ సలోన్ ఏర్పాటు వెనుక ఒక పెద్ద త్యాగం ఉందని నైనిక చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

ఆమె తల్లి ఒడిశాలో ఎంతో ఆశపడి కట్టుకున్న సొంత ఇంటిని అమ్మి, ఆ డబ్బులను ఈ సలోన్ వ్యాపారం కోసం పెట్టుబడిగా పెట్టారట. హైదరాబాద్‌లోని ఒక లగ్జరీ సలోన్ కోసం సుమారు 70 నుండి 80 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగిందని తెలిపింది.  కొన్ని రోజులలో తన తల్లి ఒత్తిడికి గురైనప్పటికీ, మొత్తం మీద హైదరాబాద్ ప్రజల నుండి మంచి మద్దతు లభిస్తోందని, తన తల్లి ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు.  తన వ్యక్తిగత సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ, వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయని నైనిక తెలిపారు. అయితే, క్లీన్ ప్రాజెక్ట్‌లు రావడం లేదని తెలిపింది నైనిక.. ఒక నిర్మాత కమిట్ మెంట్ అడిగారని.. ఈమేరకు మెసేజ్ లో ఒక ఫామ్ నింపామని పంపించారని.. దాని మీకు సిగ్గులేదా రిప్లే ఇచ్చా అని తెలిపింది నైనిక.

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us