
బిగ్ బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఈ టాలీవుడ్ బ్యూటీ కూడా ఒకరు. హౌస్ లో తన ఆటతో పాటు గ్లామర్ తోనూ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసిందీ అందాల తార. విజేతగా నిలవకపోయినా మంచి గుర్తింపు తోనే బయటకు వచ్చింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోలను అందులో షేర్ చేస్తోంది. ఎక్కువగా సినిమా విషయాలతోనే వార్తల్లోనిలిచే ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. అక్కడ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా తన బ్రేకప్ స్టోరీని బయట పెట్టి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. నేను ప్రేమించిన అబ్బాయికి పెళ్లి అయిపోయింది. అతనికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తనకు మంచి భార్య దొరికింది. ప్రస్తుతం అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుకోవడం లేదు. మనం ఇష్టపడ్డ వ్యక్తి సంతోషంగా ఉండడమే కదా మనం కోరుకునేది. అంతకన్నా ఇంకేంకావాలి. అయితే వాళ్ల పేరెంట్స్ అందరికీ నేనంటే ఇష్టం కానీ మా ఇద్దరికీ రాసిపెట్టలేదు’ అని ఎమోషనల్ అయ్యిందీ అందాల తార.
ఇలా బ్రేకప్ స్టోరీ చెప్పి ఆడియెన్స్ ను షాక్ ఇచ్చిన ఆ బిగ్ బాస్ బ్యూటీ మరెవరో కాదు దివి. అయితే ఆ అబ్బాయి ఎవరో మాత్రం ఈ బ్యూటీ చెప్పలేదు. ఈ మధ్యన టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ ఎక్కువగా కనిపిస్తోందీ అందాల తార. గతేడాది ఏకంగా నాలుగు సినిమాల్లో నటించిందీ ముద్దుగుమ్మ. లంబసింగి సినిమాలో మెయిన్ లీడ్ గా మెప్పించిన దివి సింబా, పుష్ప 2 సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ తో అలరించింది. ఈ ఏడాది ప్రారంభంలో బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ లో ఓ కీలక పాత్ర పోషించింది దివి. లేటెస్ట్ గా సన్నీ డియోల్ నటించిన జాట్ లోనూ పోలీస్ కానిస్టేబుల్ గా కనిపించి ఆకట్టుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి