Darshan: ‘నన్ను, నా ఫ్యామిలీని చంపుతామంటున్నారు’.. దర్శన్‌పై బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫిర్యాదు.. ఏం జరిగందంటే?

రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడైన దర్శన్ ఇటీవలే మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉంటే దర్శన్‌పై కొత్త ఫిర్యాదు దాఖలైంది. ఇటీవలే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ప్రముఖ కంటెస్టెంట్ హీరో దర్శన్ పై సంచలన ఆరోపణలు చేశాడు.

Darshan: 'నన్ను, నా ఫ్యామిలీని చంపుతామంటున్నారు'.. దర్శన్‌పై బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫిర్యాదు.. ఏం జరిగందంటే?
Darshan
Follow us
Basha Shek

|

Updated on: Nov 07, 2024 | 6:49 AM

రేణుకాస్వామి హత్యకేసు ప్రధాన నిందితుల్లో ఒకరైన దర్శన్‌కు మధ్యంతర బెయిల్‌ లభించింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతన్న నటుడికి ఆరు వారాల పాటు బెయిల్ మంజూరవ్వడంతో ఇటీవలే అతనిని జైలు నుంచి విడుదల చేశారు. అయితే మధ్యంతర బెయిల్‌ వచ్చాక దర్శన్ కు వరుసగా సమస్యలు చుట్టుముడుతున్నాయి. మధ్యంతర బెయిల్‌పై పోలీసులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీని తరువాత, ఇప్పుడు దర్శన్, అతని అభిమానులపై బెంగళూరులో కొత్త ఫిర్యాదు దాఖలైంది. తాజాగా బిగ్ బాస్ నుంచి వైదొలిగిన న్యాయవాది జగదీష్ హీరో దర్శన్ పై ఫిర్యాదు చేశారు. ఇటీవలే బిగ్ బాస్ నుంచి బయటకువచ్చిన లాయర్ జగదీష్ ఎప్పటిలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. కొన్ని రియాలిటీ షోలలో పాల్గొన్న జగదీష్, కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అలాగే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే నటుడు దర్శన్ కేసుపై న్యాయవాది జగదీష్ కూడా మాట్లాడారు.

దర్శన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు అతడి అభిమానులు తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని జగదీష్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు చాలా మంది దర్శన్ అభిమానులు సోషల్ మీడియాలో జగదీష్‌పై అనుచిత పోస్ట్‌లను పంచుకున్నారు. కొందరు దర్శన్ ను, అతని కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయమై న్యాయవాది జగదీష్, దర్శన్ తో పాటు అతని అభిమానులపై ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

దర్శన్ పై ఫిర్యాదు చేసిన న్యాయవాది జగదీష్..

దీనిపై కొడిగేహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన న్యాయవాది జగదీష్, ‘దర్శన్‌తో నేను ఏకవచనంతో మాట్లాడానని దర్శన్ అభిమానులు నన్ను బెదిరించారు. దర్శన్ అభిమానులు కొందరు నాకు రెండు రోజుల్లో వెయ్యికి పైగా కాల్స్ చేశారు. దర్శన్ అభిమాని రిషి అతనికి చాలాసార్లు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడు. ఇదంతా చేస్తున్నది అభిమానులే అయినా దీని వెనక దర్శన్ ఉన్నాడంటూ జగదీష్ ఫిర్యాదు చేశాడు. దర్శన్‌కి రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారి నుండి నాకు మరియు నా కుటుంబానికి రక్షణ అవసరం. మాకు రక్షణ కల్పించడంతో పాటు దర్శన్, రిషిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాది జగదీష్ ఫిర్యాదులో కోరారు.

నాకు రక్షణ కల్పించండి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..