Siva Karthikeyan: శివ కార్తికేయన్‌ను హత్తుకుని ఏడ్చేసిన అమ్మాయిలు.. వీడియో వైరల్.. ఏం జరిగిందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ సినిమా అమరన్. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ యాక్ట్ చేసింది. దీపావళి కానుకగా అక్టోబర 31న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది.

Siva Karthikeyan: శివ కార్తికేయన్‌ను హత్తుకుని ఏడ్చేసిన అమ్మాయిలు.. వీడియో వైరల్.. ఏం జరిగిందంటే?
బయోగ్రాఫికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ పాత్రలో నటించారు శివ కార్తికేయన్‌. ఆయన భార్యగా సాయి పల్లవి నటనకు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ ఈ సినిమాను నిర్మించారు.
Follow us
Basha Shek

|

Updated on: Nov 07, 2024 | 7:24 AM

మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం అమరన్. శివ కార్తికేయన్ ముకుంద్ పాత్రలో, అతని భార్య ఇందు వర్గీస్ రెబెక్కా పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించారు. పెరియా స్వామి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సఫీస్ వద్ద బ్లాక బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. ఇప్పటికే అమరన్ సినిమా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. శివ కార్తికేయన్, సాయి పల్లవిల అభినయం నెక్ట్స్ లెవెల్ అని చూసిన వారందరూ చెబుతున్నారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి. దీంతో చిత్ర బృందం ఆనందంలో మునిగితేలుతోంది. ఈక్రమంలోనే తాజాగా ఈ సినిమాకి సంబందించిన సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. హైదరాబాద్ వేదికగా జరిగన ఈ ఈవెంట్ కి శివకార్తికేయన్, సాయి పల్లవి లతో పాటు చిత్రబృందం కూడా వచ్చింది. అలాగే టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్ కూడా హాజరయ్యాడు.

అమరన్ సక్సెస్ మీట్ కు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా భారీగా హాజరయ్యారు. శివకార్తికేయన్ తో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. అయితే కొందరు లేడీ ఫ్యాన్స్ మాత్రం చాలా ఎమోషనల్ అయ్యారు. శివకార్తికేయన్ ను హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనిని చూసి అక్కడున్నవారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ఎమోషనల్ వీడియో ఇదిగో..

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషన్ బ్యానర్ పై ప్రముఖ నటుడు కమల్ హాసన్ అమరన్ సినిమాను నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూర్చారు.

అమరన్ మూవీ సక్సెస్ మీట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!