Bigg Boss 8: విష్ణు ప్రియా, పృథ్వీల గాలి తీసేసిన గంగవ్వ.. దెబ్బ అన్న చెల్లెళ్లను చేసేసిందిగా..!

నిన్నటి ఎపిసోడ్ లో కంటెండర్ షిప్ కాపాడుకునేందుకు పృథ్వీకి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. తనతో పోటీ పడే కంటెండర్ ను కూడా ఎన్నుకోమన్నాడు. దాంతో మనోడు విష్ణు ప్రియను సెలక్ట్ చేసుకున్నాడు.

Bigg Boss 8: విష్ణు ప్రియా, పృథ్వీల గాలి తీసేసిన గంగవ్వ.. దెబ్బ అన్న చెల్లెళ్లను చేసేసిందిగా..!
Bigg Boss 8
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 07, 2024 | 7:25 AM

బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి ఎపిసోడ్ లో గంగవ్వ రెచ్చిపోయింది. గంగవ్వ గౌతమ్ కు సపోర్ట్ చేసింది. దాంతో మనోడికి కొండంత బలం వచ్చింది. కాన్ఫిడెన్స్ పెరిగింది. అలాగే విష్ణు ప్రియా, పృథ్వీలకు గంగవ్వ పంచ్ లు వేసింది. మీ ఇద్దరూ అన్న చెల్లెళ్ళ తీరు ఉన్నారు అంటూ ఓ రేంజ్ లో ఆడుకుంది గంగవ్వ. ఇలా నిన్నటి ఎపిసోడ్ లో చాలానే జరిగాయి. నిన్నటి ఎపిసోడ్ లో కంటెండర్ షిప్ కాపాడుకునేందుకు పృథ్వీకి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. తనతో పోటీ పడే కంటెండర్ ను కూడా ఎన్నుకోమన్నాడు. దాంతో మనోడు విష్ణు ప్రియను సెలక్ట్ చేసుకున్నాడు. హౌస్ లో మూడు బాక్స్ లు పెట్టి ఆ మూడు బాక్స్ ల కీలు వేరు వేరు ప్లేస్ ల్లో ఉంటాయి వాటిని వెతికి పట్టుకొని బాక్స్ లు ఓపెన్ చేస్తే కంటెండర్ షిప్ బోర్డు ఉంటుంది. అది ఎవరు ముందుగా సాధిస్తారో వారే విన్నర్ అని చెప్పాడు.

ఈ గేమ్ మొదలవగానే విష్ణు చకచకా మొదటి కీ ఓపెన్ చేసింది. కానీ రెండో కీ సమయంలో పృథ్వీ స్ట్రాటజీ ప్లే చేసి విష్ణుని బోల్తా కొట్టించాడు. చివరకు పృథ్వీ విన్ అయ్యాడు. దాంతో అతను మూడో చీఫ్ కంటెండర్ అయ్యాడు. అలాగే బ్రీఫ్‌కేసు ఇచ్చాడు బిగ్ బాస్. అందులో రూ. 99 వేలు ఉన్నాయి. అలాగే తనకి వచ్చిన ఆరెంజ్ బ్రీఫ్‌కేసున విష్ణుప్రియకే ఇచ్చేశాడు పృథ్వీ. ఆతర్వాత విష్ణుని పృథ్వీ ఎలా బోల్తా కొట్టించాడో చెప్పారు తేజ, రోహిణి, హరితేజ. దానికి అందులో తప్పేముంది అంటూ కవర్ చేసింది విష్ణు. ఆతర్వాత తేజ, రోహిణి మనమధ్య పుల్లలు పెడుతున్నారు అంటూ విష్ణు వచ్చి పృథ్వీకి చెప్పేసింది.

శభాష్ విష్ణు.. నువ్వు బాగా నచ్చావ్.. నన్ను నేనే చూసుకున్నట్లుంది అంటూ పృథ్వీ అన్నాడు. దానికి విష్ణు ప్రియా గాలిలో తేలిపోయింది. యష్మీ-విష్ణుప్రియ-ప్రేరణ ముగ్గురికి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో కొన్ని బ్యాగులు ఇచ్చి.. ఆబ్యాగులను అడ్డంకులు దాటుకొని టేబుల్‌పై విసరాలి అని చెప్పాడు బిగ్ బాస్. బజార్ మోగేలోగా ఎవరు ఎక్కువ బ్యాగులు విసురుతారో వారే విన్నర్ అని చెప్పాడు. ఈ టాస్క్ లో ప్రేరణ విన్ అయ్యింది. విన్ అయిన ప్రేరణ సూట్ కేస్ ఇచ్చాడు బిగ్ బాస్ అందులో రూ.2 లక్షల 12 వేల రూపాయలు ఉన్నాయి. విష్ణుప్రియ-పృథ్వీ-హరితేజ గంగవ్వ దగ్గర డిస్కషన్ పెట్టారు. ఈ ఇంట్లో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటూ విష్ణు అడిగితే పృథ్వీ అని చెప్పింది గంగవ్వ. మరి నేను ఇష్టం లేదా అంటూ విష్ణు అడిగితే నువ్వు కూడా ఇష్టమే..అని అమాయకంగా అంది గంగవ్వ. తల్లి లేని పిల్ల కదా మనం అన్నీ చేయాలి అంటూ గంగవ్వ అంటుంటే పృథ్వీ అందుకే అవ్వ నేను గెలిచినా సూట్ కేసును విష్ణుకి ఇచ్చాను అని అన్నాడు దానికి గంగవ్వ అదిరిపోయే పంచ్ వేసింది. అవును.. మరి నీకు అన్నం తినిపిస్తాంది.. అన్నీ చేస్తాంది.. ఓ చెల్లి తీరుగా అంటూ గంగవవ్వ అంది. దాంతో విష్ణు ప్రియా, పృథ్వీ లకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. హరితేజ అయితే తెగ నవ్వుకుంది. ఆతర్వాత విష్ణుకి.. పృథ్వీ అంటే ప్రేమ అని హారిటీ గంగవ్వకు చెప్పింది. దానికి కూడా కౌంటర్ వేసింది గంగవ్వ. ఏ అది ఈ హౌస్‌ వరకే.. బయటికిపోతే ఉండదీ అంటూ అదిరిపోయే పంచ్ వేసింది గంగవ్వ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!