Nivetha Pethuraj: చిన్న పిల్లాడి చేతిలో మోసపోయిన హీరోయిన్.. అతను చేసిన పని అమ్మడి ఫ్యూజులు అవుట్

మెంటల్ మదిలో సినిమా తర్వాత చిత్రలహరి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది ఈ అమ్మడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో నివేదా పేతురాజ్ క్రేజ్ పెరిగింది. ఆతర్వాత బ్రోచేవారెవరురా సినిమా చేసింది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో సినిమాలోనూ సెకండ్ హీరోయిన్ గా చేసింది.

Nivetha Pethuraj: చిన్న పిల్లాడి చేతిలో మోసపోయిన హీరోయిన్.. అతను చేసిన పని అమ్మడి ఫ్యూజులు అవుట్
Nivetha Pethuraj
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 07, 2024 | 7:52 AM

తెలుగులో చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ తోనే కాదు నటనతోనూ ఆకట్టుకుంటున్నారు. కొంతమంది ఒక్క సినిమాతో పాపులర్ అవుతుంటే మరికొంతమంది మాత్రం నటిగా తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అలాగే ఇతర బాషల నుంచి వచ్చి కూడా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న భామలు చాలా మందే ఉన్నారు అలాంటి వారిలో నివేదా పేతురాజ్ ఒకరు. ఈ చిన్నది తన అందంతో పాటు నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన మెంటల్ మదిలో అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నివేదా పేతురాజ్. తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది.

ఇది కూడా చదవండి : Tollywood : 49 ఏళ్ళవయసులో పెళ్ళికి రెడీ ఆయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్

మెంటల్ మదిలో సినిమా తర్వాత చిత్రలహరి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది ఈ అమ్మడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో నివేదా పేతురాజ్ క్రేజ్ పెరిగింది. ఆతర్వాత బ్రోచేవారెవరురా సినిమా చేసింది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో సినిమాలోనూ సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా తర్వాత బ్లడీ మేరీ, విరాట పర్వం , దాస్‌ కా ధమ్కీ, బూ, రీసెంట్ గా పరువు అంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇది కూడా చదవండి : Jyothika: నువ్వు నా హృదయాన్ని టచ్ చేశావ్.. టాలీవుడ్ హీరోయిన్ను ఆకాశానికి ఎత్తేసిన జ్యోతిక

ఇదిలా ఉంటే తాజాగా నివేదా పేతురాజ్ ఓ ఆసక్తికర విషయాన్నీ పంచుకుంది. ఓ ఎనిమిదేళ్ల బాలుడు తనను మోసం చేశాడని తెలిపింది ఈ భామ. దీని గురించి ఆమె మాట్లాడుతూ..  చెన్నై లోని ‘అడయార్‌ అనే ప్రాంతంలో సిగ్నల్ దగ్గర నా కారు ఆగింది.  అయితే అక్కడు ఓ ఎనిమిదేళ్ళ బాలుడు డబ్బులు అడుగుతూ కనిపించాడు. అతని ఫ్రీగా డబ్బులు ఎందుకు ఇవ్వాలీలే అని.. అతని దగ్గర ఉన్న రూ. 50 విలువైన పుస్తకాన్నికొనాలని అనుకున్న.. రూ. 100 నోట్ తీసి ఇవ్వబోతే అతను రూ. 500 అడిగాడు. దాంతో నేను నా రూ.100 నోటు వెనక్కి తీసుకున్నాను. ఇంతలో ఆ పిల్లాడు ఆ పుస్తకాన్ని నా కారులోకి విసిరేసి నా చేతిలో ఉన్న రూ.100 నోటు లాక్కొని పారిపోయాడు అని చెప్పుకొచ్చింది. ఇలా ఎనిమిదేళ్ల పిల్లాడి చేతిలో తాను మోసపోయాను అని తెలిపింది నివేద.

ఇది కూడా చదవండి : ఏవండోయ్ ఇది చూశారా..! స్కూల్ డ్రస్‌లో ఉన్న ఈవిడ ఎవరో కనిపెట్టారా.? ఫేమస్ సెలబ్రెటీ సతీమణి ఆమె

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!