AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7: పాపం పాప తొందరపడింది.. రూ 15 లక్షలు పోగొట్టుకుంది.. ఎమోషనల్ అయిన బిగ్ బాస్ బ్యూటీ

బిగ్ బాస్ కంటే ముందు చాలా సినిమాలో నటించింది మెప్పించింది కిరణ్. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలలో నటించింది ఈ చిన్నది. తెలుగులో నువ్వు లేక నేను లేను అనే సినిమాతో పరిచయం అయ్యింది. తెలుగులో ఎన్నో స్పెషల్ సాంగ్స్ చేసింది కిరణ్ రాథోడ్. కొన్ని చిన్న చిన్న రోల్స్ చేసింది. అలాగే ఐటెం సాంగ్స్ చేసింది కిరణ్ రాథోడ్. ఇక బిగ్ బాస్ సీజన్ 7లో కిరణ్ రాథోడ్ పాల్గొన్నారు. కానీ ఆమె ఎక్కువ రోజులు హౌస్ లో లేరు.

Bigg Boss 7: పాపం పాప తొందరపడింది.. రూ 15 లక్షలు పోగొట్టుకుంది.. ఎమోషనల్ అయిన బిగ్ బాస్ బ్యూటీ
Kiran Rathod
Rajeev Rayala
|

Updated on: May 22, 2024 | 12:48 PM

Share

బిగ్ బాస్ ద్వారా చాలా మంది క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. బిగ్ బాస్ సీజన్ 7 అన్ని సీజన్స్ కంటే హైలైట్ అనే చెప్పాలి. సీజన్ 7లో చాలా రచ్చ జరిగింది. సీజన్ 7లో పాల్గొన్న చాలా మంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో కిరణ్ రాథోడ్ ఒకరు. బిగ్ బాస్ కంటే ముందు చాలా సినిమాలో నటించింది మెప్పించింది కిరణ్. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలలో నటించింది ఈ చిన్నది. తెలుగులో నువ్వు లేక నేను లేను అనే సినిమాతో పరిచయం అయ్యింది. తెలుగులో ఎన్నో స్పెషల్ సాంగ్స్ చేసింది కిరణ్ రాథోడ్. కొన్ని చిన్న చిన్న రోల్స్ చేసింది. అలాగే ఐటెం సాంగ్స్ చేసింది కిరణ్ రాథోడ్. ఇక బిగ్ బాస్ సీజన్ 7లో కిరణ్ రాథోడ్ పాల్గొన్నారు. కానీ ఆమె ఎక్కువ రోజులు హౌస్ లో లేరు. మొదటి వారమే ఎలిమినేట్ అయ్యింది కిరణ్ రాథోడ్.

బిగ్ బాస్ తర్వాత ఆమె ఎక్కువగా కనిపించలేదు. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూనే వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. రూ. 15 లక్షలు నష్టపోయాను అని చెప్పుకొచ్చింది కిరణ్ రాథోడ్. అసలు ఈ అమ్మడు ఎందుకు నష్టపోయింది.? అంతగా ఏం చేసింది.?

ప్రస్తుతం ఫ్రాన్స్ లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా సెలబ్రెటీలు ఈ ఫెస్టివల్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే చాలా మంది అక్కడ రెడ్ కార్పెట్ పై నడిచారు. అలాగే కిరణ్ రాథోడ్ కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళ్ళింది. అయితే ఫ్రాన్స్ కు వెళ్లేందుకు వీసా కోసం గత నెలలో అప్లై చేసింది. మే 13నే ఫ్రాన్స్ వెళ్లాల్సి ఉంది.కానీ వీసా రాలేదు. కానీ అక్కడ హోటల్ బుకింగ్స్ , ట్రావెల్ బుకింగ్స్ అన్ని చేసుకుందట. ఇందుకోసం 15 లక్షలు ఖర్చు చేసిందట. అయితే వీసా రాకపోవడమతొ మొత్తం డబ్బు నష్టపోయాను అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది తనకు మానసిక ఒత్తిడి కలిగించిందని చెప్పుకొచ్చింది.

కిరణ్ రాథోడ్ ఇన్ స్టా ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us