డీమన్ పవన్‌కు బ్యాక్ పెయిన్.. అల్లాడిపోయిందమ్మా.. పాపం రీతూ..!!

బిగ్ బాస్ సీజన్ 9 త్వరలోనే పూర్తి కాబోతుంది. చివరి దశకు వచ్చే సరికి సీజన్ 9 మరింత ఆసక్తికరంగా మారింది. హౌస్ మేట్స్ మధ్య చిత్ర విచిత్రమైన టాస్క్ లు పెట్టాడు బిగ్ బాస్. ఓల్డ్ కంటెస్టెంట్స్ ను రంగంలోకి దింపాడు. గౌతమ్, మానస్, దేతడి హారిక, ప్రియాంక, ప్రేరణ, హౌస్ లోకి వచ్చారు.

డీమన్ పవన్‌కు బ్యాక్ పెయిన్.. అల్లాడిపోయిందమ్మా.. పాపం రీతూ..!!
Biggboss

Updated on: Nov 29, 2025 | 8:43 AM

బిగ్ బాస్ సీజన్ 9కు త్వరలోనే ఎండ్ కార్డు పడనుంది. ఇప్పటికే హౌస్ లో 9 మంది హౌస్ మేట్స్ మిగిలారు. ఇక ఈ వారం హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఇక చివరి కెప్టెన్ అయ్యేందుకు కెప్టెన్సీ కంటెండర్స్ గా ఆరుగురు మిగిలారు. కళ్యాణ్, డీమాన్, ఇమ్మానుయేల్, దివ్య, సంజన, రీతూ కెప్టెన్సీ రేస్ లో ఉన్నారు. వీరిలో ఒకరు హౌస్ లో చివరి కెప్టెన్ అవ్వనున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆరుగురికి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక చివరిగా సీజన్ చివరి కెప్టెన్ అయ్యేందుకు కళ్యాణ్ పడాల-డీమాన్ పవన్ ఇద్దరూ రేసులో మిగిలారు. రోడ్ టూ కెప్టెన్సీ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ కు తనూజ సంచాలక్‌గా ఉంది.

ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూపులు

ఇక ఈ టాస్క్ లో కళ్యాణ్ చెలరేగిపోయాడు. కళ్యాణ్ కు ఇమ్మాన్యుయేల్ సపోర్ట్ చేశాడు. మరో వైపు పవన్ కు రీతూ చౌదరి సపోర్ట్ చేసింది. ఇక ఈ టాస్క్ లో కళ్యాణ్ వేగంగా రోడ్లు పూడ్చుతూ దూసుకుపోయాడు. కానీ పవన్ చివరిలో ఆడలేక పడిపోయాడు. నడుమునొప్పితో ఆడలేక విలవిలలాడిపోయాడు. పక్కనే ఉన్న రీతూ లేవరా లే అంటూ సపోర్ట్ చేసిన నడుము నొప్పితో అల్లాడిపోయాడు. దాంతో హౌస్ మేట్స్ అతనికి మాసాజ్ చేశారు. అయినా నొప్పి తగ్గకపోవడంతో పవన్ ఆడలేకపోయాడు.

ఇవి కూడా చదవండి

ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ ఊపేస్తోంది.. సోషల్ మీడియా సెన్సేషన్ ఈ భామ

మరోవైపు కళ్యాణ్ వేగంగా తన టాస్క్ పూర్తి చేసి.. విన్ అయ్యాడు. ఫైనల్ కెప్టెన్ అయ్యాడు. కాగా నొప్పితో పడిపోయిన డీమన్ పవన్ ను చూసి రీతూ కన్నీళ్లుపట్టుకుంది. ఇక చివరి కెప్టెన్ అయిన కళ్యాణ్ కు హౌస్ మేట్స్ అభినందనలు తెలిపారు. ఇక బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ అని కొందరు.. తనూజ అని మరికొందరు బయట రచ్చ చేస్తున్నారు. కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9 చివరిలో రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఓటింగ్ లోనూ టాప్ లో దూసుకుపోతున్నాడు. దాంతో ఈ ఇద్దరిలో ఒకరు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

బస్సులో నుంచి దించేశారు.. భోజనం చేస్తుంటే అవమానించారు.. రాజు వెడ్స్ రాంబాయి దర్శకుడి కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.