Bigg Boss 9 Telugu: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్‏బాస్.. ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్..

బిగ్‏బాస్ సీజన్ 9 ప్రారంభమై వారం గడిచిపోయింది. ఎన్నో ఆశలతో హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ నుంచి ఇప్పుడు ఒకరు బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది. అయితే ఈసారి కూడా మొదట లేడీ కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు టాక్ వినిపిస్తుంది.

Bigg Boss 9 Telugu: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్‏బాస్.. ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్..
Bigg Boss 9 Telugu.jp

Updated on: Sep 13, 2025 | 9:31 PM

బిగ్‏బాస్ సీజన్ 9 ఇప్పుడు బుల్లితెరపై దూసుకుపోయింది. ఈ షో స్టార్ట్ అయ్యి అప్పుడే వారం అయ్యింది. దీంతో ఇప్పుడు ఎలిమినేషన్ సమయం ఆసన్నమైంది. తొలివారం లో ఎవరు హౌస్ నుంచి బయటకు రానున్నారనేది తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే బిగ్‏బాస్ తెలుగులో ప్రతి సీజన్ లో మొదటి వారం కచ్చితంగా సీనియర్ భామలే ఎలిమినేట్ అవుతుంటారు. సీనియర్ ముద్దుగుమ్మలు ఎక్కువగా బయటకు వచ్చిన సందర్భాలు చూశాం. అయితే ఈసారి కూడా సీరియర్ భామలే బయటకు వస్తున్నారా ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఇవి కూడా చదవండి : Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న చిన్నది.. ఈ హీరోయిన్ గురించి తెలుసా.. ?

మొత్తం 15 మందితో ప్రారంభమైన ఈ షోలో.. ఇప్పుడు మొదటి వారం తొమ్మిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. హౌస్ లో ఉన్న 9 మంది సెలబ్రెటీలలో భరణి తప్ప మిగిలిన 8 మంది కంటెస్టెంట్ నామినేట్ అయ్యారు. ఇక సామాన్యులలో డీమాన్ పవన్ మాత్రమే నామినేట్ అయ్యాడు. ఇక ఫస్ట్ వీక్ లక్స్ పాప ఫ్లోరా షైనీ, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మలు తక్కువ ఓటింగ్ తో డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే వీరిద్దరిలో ఎవరు ఒకరు ఎలిమినేట్ కానున్నారనే సమాచారం.

ఇవి కూడా చదవండి

ఫ్లోరా షైనీ, శ్రష్టి వర్మ, రీతూ చౌదరి, సంజనా, తనూజా, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్ నామినేట్ కాగా.. వీరిలో ముందు సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. కానీ సుమన్ శెట్టి, తనూజలకు హయ్యెస్ట్ ఓటింగ్ వచ్చింది. ఇక తర్వాత తక్కువ ఓటింగ్ వచ్చింది మాత్రం ఫ్లోరా షైనీ, శ్రష్టి వర్మకు మాత్రమే. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈసారి శ్రష్టి వర్మ ఎలిమినేట్ కానుందట. ఆమెకు ఫ్లోరా షైనీ కంటే తక్కువ ఓటింగ్ వచ్చిందని సమాచారం. అయితే బిగ్ బాస్ ఓటింగ్, ఎలిమినేషన్ ఎప్పుడూ ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే.

ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..

అయితే ఫ్లోరా షైనీ ఇప్పుడు షోలో సైలెంట్ అయ్యింది. సంజనతో బాత్రూమ్ ఇష్యూ తర్వా ఆమె పూర్తిగా కనిపించడం లేదు. దీంతో ఫ్లోరాకు అంతగా స్క్రీన్ స్పేస్ వచ్చింది లేదు. అలాగే ప్రతి సీజన్ లోనూ హౌస్ లో ఎవరైతే సీనియర్ తారలు ఉంటారో వారే ఎలిమినేట్ అవుతుంటారు. ఇప్పుడు ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. కానీ అలా కాకుండా ఈసారి శ్రష్టి వర్మను ఎలిమినేట్ చేశారట బిగ్ బాస్ టీం. అయితే ఈ విషయం క్లారిటీ రావాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి : Actors: ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు టాలీవుడ్..