Bigg Boss Telugu 9: హరీష్ వర్సెస్ ఇమ్మానుయేల్.. ఎవరు అంకుల్.? ఎవరు గుండు.? మొదటి రోజే గొడవ షురూ..

బిగ్‏బాస్ సీజన్ 9 ఫస్ట్ డే ప్రోమో రిలీజ్ అయింది. సెప్టెంబర్ 7న గ్రాండ్ గా మొదలైన ఈ షోలోకి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అందులో కామనర్స్ ఆరుగురు, సెలబ్రెటీలు 9 మంది ఉన్నారు. కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీల మధ్య రణరంగమే అంటూ ముందే చెప్పేశారు నాగ్. అలాగే రెండు హౌస్ లు ఉంటాయని.. ఇద్దరు వేరుగా ఉంటారని చెప్పారు.

Bigg Boss Telugu 9: హరీష్ వర్సెస్ ఇమ్మానుయేల్.. ఎవరు అంకుల్.? ఎవరు గుండు.? మొదటి రోజే గొడవ షురూ..
Bigg Boss 9

Updated on: Sep 08, 2025 | 8:13 PM

బిగ్ బాస్ సీజన్ 9 రీసెంట్ గా మొదలైంది. నిన్న ( ఆదివారం) రోజున గ్రాండ్ గా బిగ్ బాస్ సీజన్ 9 మొదలైంది. ఈ సారి హౌస్ లోకి 15మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. 9 మంది సెలబ్రెటీలతో పాటు ఐదుగురు సామాన్యులు హౌస్ లోకి అడుగుపెట్టారు. అగ్నిపరీక్ష నుంచి ఫిల్టర్ చేసిన వారి నుంచి ఐదుగురిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. ఇక హౌస్ లోకి వెళ్లిన సెలబ్రెటీలలో తనూజ, ఇమ్మానుయేల్, రీతూ చౌదరి, రాము నాయక్, శ్రేష్టి శర్మ, భరణి, ఫ్లోరా షైనీ, సంజన, సుమన్ శెట్టి హౌస్ లోకి అడుగుపెట్టారు. అలాగే కామానర్లుగా డిమాన్ పవన్, హరీష్, ప్రియా శెట్టి, శ్రీజ దమ్ము, మర్యాద మనీష్ హౌస్లోకి అడుగుపెట్టారు.

ఇక హౌస్ లోకి వెళ్లిన వారిని సపరేట్ చేశారు నాగ్.. ఓనర్లు , టెనెంట్స్ అంటూ హౌస్ మేట్స్ ను సపరేట్ చేశారు. సెలబ్రెటీలు టెనెంట్స్ గా సామాన్యులను ఓనర్స్ గా చేసి రెండు ఇళ్లలో ఉంచారు. టెనెంట్స్ గా ఉన్నవారు , ఓనర్స్ ఇంట్లోకి వెళ్లడంతో బిగ్ బాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆహారాన్ని వెనక్కి పంపించేయాలి అని ఆదేశించారు బిగ్ బాస్. ఇప్పటికే విడుదలైన ప్రోమోలో అది చూపించారు. ఇప్పటికే రెండు ప్రోమోలను విడుదల చేశారు. తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబంధించి మూడో ప్రోమోను విడుదల చేశారు.

ఈ వీడియోలో ఇమ్మానుయేల్ తో ఈ గార్డెన్ శుభ్రం చేయడానికి ఎంత సమయం పట్టొచ్చు అని అడిగాడు బిగ్ బాస్.. దానికి ఇది శుభ్రం అవ్వడం లేదు.. గ్రాస్ లో ఇరుక్కుపోయిన చెత్తను క్లిన్ చేయాలంటే చేత్తో తీయాలి. ఒక రోజు సమయం పడుతుందని చెప్తాడు. ఎంత సమయం పడుతుందో మోనేటర్ నిర్ణయిస్తారు అని చెప్తాడు. ఆతర్వాత హరీష్ ను గుండు అంకుల్ అని సరదాగా సంబోధిస్తారు ఇమ్మానుయేల్. కొంచం చూసి ఇవ్వండి అని ఇమ్మానుయేల్ అనగానే.. మీరు కూడా చూసి మాట్లాడండి బ్రదర్.. బాడీ షేమింగ్ వరకు వెళ్ళకండి అని సీరియస్ అయ్యాడు హరీష్. ఎవరు అంకుల్.? ఎవరు గుండు.? అంటూ సీరియస్ అయ్యాడు హరీష్. నేను సారీ చెప్పా.. మర్యాదగా వచ్చి సారీ చెప్పా అని ఇమ్మానుయేల్ అనగానే .. నేను కూడా ఏదోఒకటి అనేసి సారీ చెప్పొచ్చు అని హరీష్ అన్నాడు. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. లిమిట్ అని హరీష్ అనగానే.. ఇమ్మానుయేల్ కూడా సీరియస్ అయ్యాడు.. దాంతో భరణి కలుగజేసుకొని ఆపే ప్రయత్నం చేశాడు. ఈ ప్రోమో చూస్తుంటే మొదటి రోజే గొడవ గట్టిగానే అయ్యిందని అర్ధమవుతుంది. మరి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.