
బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో.. ఇప్పుడు తెలుగులోనూ అలరిస్తుంది.. ఇప్పటికే ఈ రియాల్టీ గేమ్ షో తెలుగులో 8 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 9కు రంగం సిద్ధం అవుతుంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభంకానుంది. బిగ్ బాస్ సీజన్ 9ను ఈసారి చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి సామాన్యులకు అవకాశం ఇస్తూ అగ్నిపరీక్ష అనేడి ప్లాన్ చేశారు. కొత్త సీజన్ పై అంచనాలను అమాంతం పెంచేసింది. మరోవైపు బిగ్ బాస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.అలాగే ఈసారి సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనున్నారు.
గతంలో కొన్ని సార్లు సామాన్యులను తీసుకొచ్చినా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. కానీ రైతు బిడ్డగా వచ్చిన పల్లవి ప్రశాంత్ ఏకంగా విన్నర్ గా నిలిచాడు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ టీం మరోసారి సామాన్య ప్రజలకు ఒక బంపరాఫర్ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ఇప్పటికే చాలా మంది అప్లై చేస్తున్నారు. ఇక చాలా మంది సామాన్యులు కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటికే అగ్ని పరీక్ష అనేది నిర్వహిస్తున్నారు.
కామన్ మ్యాన్ కోటాలో సెలక్ట్ చేసి హౌస్ లోకి పంపించేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రక్రియకు ముగ్గురు జడ్జిలు ఉండనున్నారు. బిగ్బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్, బిగ్బాస్ నాన్ స్టాప్ విన్నర్ బింధుమాధవి, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ నవదీప్ ఈసారి కామన్ మ్యాన్ సెలక్షన్ ప్రాసెస్ చూడనున్నారు. ఇదివరకే ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. తాజాగా మరో ప్రోమోను విడుదల చేశారు. కామన్ మెన్ క్యాటగిరీ నుంచి వచ్చిన 15 మంది కంటెస్టెంట్లు గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు, కొన్ని టాస్క్ లు కూడా ఇచ్చి సెలక్ట్ చేస్తున్నారని అర్ధమవుతుంది. కొంతమంది బ్రతిమిలాడుకున్నారని ఈ ప్రోమోలో చూపించారు.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే 15 మంది వీరే..
అనుష రత్నం (ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్), ప్రసన్న కుమార్ ( దివ్యాంగుడు), దమ్ము శ్రీజ (ఇన్‌స్టాగ్రామ్ ఫేమ్), మిస్ తెలంగాణ కల్కి, డాలియా (జిమ్ కోచ్), దివ్య నిఖిత (వెజ్ ఫ్రైడ్ మోమో ఫేమ్), శ్రియ (చిన్న వయస్సు కంటెస్టెంట్), శ్వేతా శెట్టి (యూకే బాడీబిల్డర్), పవన్ కళ్యాణ్ (ఆర్మీ ), ప్రశాంత్( లాయర్), షాకిబ్ (సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్), డెమోన్ పవన్ (ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్), ప్రియా శెట్టి, మర్యాద మనీష్ (బిజినెస్ మాన్), మాస్క్డ్ మ్యాన్ హృదయ్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.