బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు హౌస్ మేట్స్. నామినేసన్స్ సమయంలో హౌస్ మేట్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇక విష్ణు ప్రియా, సోనియా మధ్య ఓ రేంజ్‌లో వాదనలు జరిగాయి. సోనియా కాస్త హద్దులు దాటే మాట్లాడింది. విష్ణు ప్రియా దురుసుగా మాటలు విసిరేసింది. విష్ణు ప్రియకు బట్టలు సరిగ్గా వేసుకోవడం కూడా రాదు అంటూ సోనియా చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. నామినేషన్స్ సమయంలో విష్ణు ప్రియా పై సోనియా చాలా కామెంట్స్ చేసింది. అడల్ట్రీ జోక్స్ వేస్తుంది అంటూ ఆమెను టార్గెట్ చేసింది. విష్ణు ప్రియా సరిగ్గా బట్టలు వేసుకోదని ఆమె వల్ల మిగితా మెల్ కంటెస్టెంట్స్ అంత ఇబ్బంది పడుతున్నారని అనేసింది సోనియా. దానికి విష్ణు ప్రియా నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డారు.? అని విష్ణు ప్రియా అడిగ్గా.. ఇంట్లో అందరూ ఇబ్బంది పడ్డారు అని సోనియా ఆమెతో వాగ్వాదం పెట్టుకుంది.
ఆ తర్వాత ఆమె విష్ణు ప్రియను ఎందుకు అలా అన్నదో వివరణ ఇచ్చింది సోనియా.. నిఖిల్, అభయ్ తో సోనియా మాట్లాడుతూ.. “విష్ణుప్రియా రూమ్ లో బట్టలు మార్చుకుంటున్న టైంలో ఆదిత్య ఓం ఆమె రూమ్‌లో ఉందని తెలియక ఆ రూమ్ లోకి వెళ్లారు..ఆ తర్వాత ఆయన వణుకుతూ బయటకు వచ్చారు.. ఆ టైం లో విష్ణు జస్ట్ బ్లౌజ్‌లో ఉంది.. ఆతర్వాత బయటకు వచ్చిన విష్ణు ప్రియా ఆదిత్య దగ్గరకు వచ్చి మిమ్మల్నిఆన్ కంఫర్ట్బుల్ గా ఫీల్ చేశాను సారీ అని చెప్తుంది’’ అని సోనియా చెప్పుకొచ్చింది.
అయితే అయితే సోనియా ఎందుకు విష్ణుప్రియను అంతగా టార్గెట్ చేసిందో మాత్రం ఎవరికీ అర్ధం కాలేదు. నిజాన్ని విష్ణు హౌస్ లో బాగానే ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో లా అందాలు ఆరబోయకుండా.. తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తన ఆట తాను ఆడకుండా.. విష్ణు ప్రియా మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. అంతే కాకుండా హౌస్ లో చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది అనిపిస్తుంది. ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపిస్తే వారి పక్కకు చేరిపోతుంది సోనియా. నిన్నటి వరకు నిఖిల్ తో కనిపించింది. కాగా నిన్నటి ఎపిసోడ్ లో అతన్ని కూడా పక్కన పెట్టేసింది. ఇప్పుడు అభయ్, పృథ్వీతో మాటలు కలుపుతోంది సోనియా. మరి ఈ అమ్మడు ఎన్నివారాలు హౌస్ లో నెట్టుకొస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.