బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో చాలా మంది ప్రేక్షకులకు తెలియని మొఖాలే.. ఇక అంతో ఇంతో తెలిసిన వారిలో సోనియా ఆకుల ఒకరు. హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. పెద్దపల్లి జిల్లా, మంథని చెందిన ఈ అమ్మడు రామ్ గోపాల్ వర్మ సినిమాతో పాపులర్ అయ్యింది. అంతకు ముందు 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది సోనియా. ఆతర్వాత ఆర్జీవీ దర్శకత్వం వహించిన కరోనా వైరస్, ఆశ ఎన్‌కౌంటర్ సినిమాల్లో నటించింది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపిస్తున్న సోనియా.. మొదట్లో నిఖిల్ తో చనువుగా ఉంది. దాంతో ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.
తాజాగా సోనియా తన లవ్ స్టోరీ చెప్పుకొచ్చింది. సోనియాకు బయట లవర్ ఉన్న విషయం పై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. తాజాగా తన లవ్ స్టోరీని బయట పెట్టింది. నిన్నటి ఎపిసోడ్ లో సోనియా ప్రేరణతో డిస్కషన్ పెట్టింది. ఈ క్రమంలోనే తన లవ్ మ్యాటర్ చెప్పింది. నేను ఎప్పుడూ ఆయనకు ప్రపోజ్ చేయలేదు కానీ రెండున్నరేళ్లుగా మేముఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం.. నేను స్టార్ట్ చేసిన ఎన్‌జీఓకి వెబ్‌సైట్ డిజైనింగ్ ఆయనే చేశారు.. అలానే దానికి ఆయన కూడా యూఎస్ నుంచి ఓ స్పాన్సర్ అని తెలిపింది.
అయితే ఇంకేం మరి ఇద్దరూ పెళ్లి చేసుకోవొచ్చుగా అని ప్రేరణ అంటే ఊహించని ట్విస్ట్ చెప్పింది సోనియా.. అయితే ఆయనకు వేరే అమ్మాయితో రిలేషన్ ఉంది.. కానీ ఇప్పుడు కాదు.. కానీ ఇప్పటికీ డిపెండెన్సీ ఉంది. అయితే ఆయన నా లైఫ్‌లోకి వచ్చాకా చాలా మార్పులు వచ్చాయ్.. నా గోల్స్‌కి ఇబ్బంది అవుతుందని ఫ్యామిలీ నుంచి నేను దూరంగా ఉండేదాన్ని.. కానీ తను వచ్చాకే అది మారింది అని తెలిపింది. ఇంతలో మరి వేరే ఓ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు అన్నావ్ గా దాని సంగతేంటీ అని ప్రేరణ అడిగింది. దాంతో ప్రేరణ చెవి దగ్గరికొచ్చి ఆయనకి డైవర్స్ అయింది అంటూ చిన్నగా చెప్పింది సోనియా. ఆతర్వాత అతను నా డెసిషన్ కోసం వెయిటింగ్ అంతే.. అంటూ చెప్పుకొచ్చింది సోనియా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.