Bigg Boss 8 Telugu: అమ్మాయిలు ఇబ్బందిపడితే బయటకే.. ఇకపై నో హగ్స్.. అతడికి నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..

|

Sep 22, 2024 | 8:52 AM

అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోకుండా ఎగ్స్ టాస్కులో గట్టిపోటీ ఇచ్చిన అమ్మాయిలను అభినందించారు. అనంతరం బిగ్‏బాస్ పై ఇష్టమొచ్చినట్లు మాటలతో రెచ్చిపోయిన అభయ్ నవీన్ కు చుక్కలు చూపించాడు నాగ్. నువ్వు పెద్ద సైకోలా ఉన్నాయ్.. నువ్వు క్యాన్సర్ కంటే ప్రమాదం.. హౌస్ లో ఉంటే ప్రతి ఒక్కరికి సోకుతుంది.. బయటకు పో అంటూ డోర్స్ ఓపెన్ చేశాడు. బిగ్‏బాస్ ను అభయ్ అన్న మాటలు అన్నింటిని వీడియోగా చూపించడంతో ఇటు అడియన్స్ కూడా షాకయ్యారు.

Bigg Boss 8 Telugu: అమ్మాయిలు ఇబ్బందిపడితే బయటకే.. ఇకపై నో హగ్స్.. అతడికి నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..
Manikanta
Follow us on

ప్రభావతి 2.0 టాస్కులో అమ్మాయిలు అదరగొట్టారు అంటూ మెచ్చుకున్నాడు హోస్ట్ నాగార్జున. కానీ నిన్నటి ఎపిసోడ్‏లో ఒక్కో కంటెస్టెంట్ గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆట తీరు, మాట, పద్దతి మార్చుకోకపోతే బయటకు పంపిస్తానని చెప్పాడు. ఈ వారం మొత్తం హౌస్మేట్స్ చేసిన తప్పులను, గొడవలను గుర్తుచేస్తూ ఒక్కొక్కరికి క్లాస్ తీసుకున్నారు. అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోకుండా ఎగ్స్ టాస్కులో గట్టిపోటీ ఇచ్చిన అమ్మాయిలను అభినందించారు. అనంతరం బిగ్‏బాస్ పై ఇష్టమొచ్చినట్లు మాటలతో రెచ్చిపోయిన అభయ్ నవీన్ కు చుక్కలు చూపించాడు నాగ్. నువ్వు పెద్ద సైకోలా ఉన్నాయ్.. నువ్వు క్యాన్సర్ కంటే ప్రమాదం.. హౌస్ లో ఉంటే ప్రతి ఒక్కరికి సోకుతుంది.. బయటకు పో అంటూ డోర్స్ ఓపెన్ చేశాడు. బిగ్‏బాస్ ను అభయ్ అన్న మాటలు అన్నింటిని వీడియోగా చూపించడంతో ఇటు అడియన్స్ కూడా షాకయ్యారు.

అతడికి రెడ్ కార్డ్ చూపిస్తూ బయటకు వెళ్లాల్సిందే అని చెప్పడంతో మోకాళ్లపై కూర్చొని క్షమాపణలు చెప్పాడు అభయ్. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని.. మరోసారి ఈ తప్పు రిపీట్ కాదంటూ రిక్వెస్ట్ చేశాడు. అయినా నాగార్జున ఒప్పుకోలేదు. చివరకు హౌస్మేట్స్ అభిప్రాయాలను అడగ్గా.. తప్పైందని.. మరో ఛాన్స్ ఇవ్వాలని చెప్పారు. దీంతో బిగ్‏బాస్ కు నాగ్ స్వయంగా సారీ చెబుతూ అభయ్ ఇంట్లో ఉండేందుకు ఒప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత మణికంఠను కన్ఫెన్షన్ రూంలోకి పిలిచి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.

అభయ్ కు క్లాస్ తీసుకున్న తర్వాత మణికంఠను కన్ఫెన్షన్ రూంలోకి పిలిచాడు నాగ్. యష్మీకి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆమెను మాటి మాటికి హగ్ చేసుకున్న వీడియోను చూపించాడు నాగ్. మణి తనను హగ్ చేసుకుంటే నచ్చడం లేదని.. ఇబ్బందిగా ఉంది బిగ్‏బాస్.. నావల్ల కావడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది యష్మి. వద్దని చెప్పినా ప్రతిసారి హగ్ చేసుకుంటున్నాడని.. తనకు చాలా ఇబ్బందిగా ఉందంటూ పృథ్వీతో చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ఇక ఈ వీడియో చూసి మణి ఆస్కా్ర్ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కేవలం యష్మితోనే కాకుండా మరికొంతమంది అమ్మాయిలతో అలాగే ప్రవర్తిస్తున్నావని సీరియస్ అయ్యాడు నాగ్. నీవల్ల హౌస్ లో ఏ ఆడపిల్ల అయినా ఇంకోసారి ఇబ్బందిపడితే మొహమాట పడకుండా బయటకు పంపిస్తానని.. నువ్వు షోకు ఎందుకు వచ్చావో గుర్తుంచుకొని ఆడాలని.. యష్మితోనే కాకుండా మరే అమ్మాయితో అలా ప్రవర్తించకూడని.. ఇకపై నో హౌస్ లో నో హగ్స్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. కొత్తగా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యేసరికి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయాను.. మరోసారి ఇలా జరగదు అంటూ సారీ చెప్పాడు మణికంఠ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.