Bigg Boss 7 Telugu: శివాజీ వర్సెస్ గౌతమ్.. “నీకిష్టమొచ్చినట్టు మేము చెయ్యం” అంటూ.. రచ్చ రచ్చ
వీరసింహాలు టీమ్ నుంచి భోలేని గర్జించే పులులు టీమ్ లోకి పంపించి అక్కడి నుంచి అర్జున్ ను లాగేసుకున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రోమో లో వీరసింహాలు టీమ్ మరో పవర్ ను దక్కించుకున్నట్టు చూపించారు. నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో బ్లాక్ కలర్ బాల్ ఎవరు దక్కించుకున్నారు అని బిగ్ బాస్ అడగ్గా వీరసింహాలు టీమ్ అని చెప్పాడు గౌతమ్.

బిగ్ బాస్ హౌస్ లో హాల్ ఆఫ్ బాల్ టాస్క్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే వీరసింహాలు టీమ్ గోల్డెన్ బాల్ దక్కించుకొని తమ టీమ్ లోని వీక్ ప్లేయర్ ను అపోజిట్ టీమ్ లోకి పంపించి అక్కడి నుంచి స్ట్రాంగ్ ప్లేయర్ ను తమ టీమ్ లోకి తీసుకున్నారు. వీరసింహాలు టీమ్ నుంచి భోలేని గర్జించే పులులు టీమ్ లోకి పంపించి అక్కడి నుంచి అర్జున్ ను లాగేసుకున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రోమో లో వీరసింహాలు టీమ్ మరో పవర్ ను దక్కించుకున్నట్టు చూపించారు. నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో బ్లాక్ కలర్ బాల్ ఎవరు దక్కించుకున్నారు అని బిగ్ బాస్ అడగ్గా వీరసింహాలు టీమ్ అని చెప్పాడు గౌతమ్. దాంతో మీకు ఓ పవర్ లభిస్తుందని చెప్పాడు.
ఆ పవర్ ఏంటంటే.. అపోజిట్ టీమ్ లో ఉన్న బాల్స్ నుంచి.. తమ టీమ్ బాల్స్ తో స్వాప్ చేసుకోవాలి అని చెప్పాడు బిగ్ బాస్. దాంతో వీటసింహాలు టీమ్ మెంబర్స్ ఎగిరి గంతేశారు. ఆతర్వాత కిచన్ లో కాఫీ పెట్టుకుంటూ శివాజీ గోల్డెన్ బాల్ అడ్వాంటేజ్ వాళ్ళకే బ్లాక్ బాల్ అడ్వాంటేజ్ వాళ్లకేనా బిగ్ బాస్ అంటూ నిరాశ వ్యక్తం చేశాడు.
ఆతర్వాత వెళ్లిపోయేటప్పుడు నేను వెళ్ళిపోవాలి కానీ నా బ్లాక్ బ్యాగ్ మాత్రం మీకుండలా అని అన్నాడు భోలే. ఆతర్వాత శివాజీ, గౌతమ్ మధ్య వాదన జరిగింది. రెండు ఎట్లా ఉంచుతారు అన్న అంటూ గౌతమ్ అడగ్గా మా ఇష్టం అయ్యా..అని అన్నాడు. మీకిష్టమొచ్చినట్టు రూల్ మార్చుకుంటే మీరే ఆడుకోండి అన్న అంటూ గౌతమ్ రివర్స్ అయ్యాడు. నీకు ఇచ్చామోచినట్టు ప్రతిసారి మేము చేయాలంటే చేయం.. బిగ్ బాస్ చెప్తాడు కదా..? నీకెందుకు కంగారు నీకు అనుకూలంగా ఉన్నప్పుడు చాలా సైలెంట్ గా ఉంటావ్..అనుకూలంగా లేకపోతే వైలెంట్ గా అవుతావు అని అన్నాడు శివాజి. దానికి నేను ఎం తప్పు చేసినా చెప్పండి అని ప్రశ్నించాడు గౌతమ్. నీతో నేను మాట్లాడలేను అని అన్నాడు శివాజీ. వెళ్తూ వెళ్తూ వాంటెడ్ వాదన పెట్టుకుంటావా నువ్వు అని శివాజీ అంటే ఎవ్వరికీ అవసరం లేదు అన్న వాంటెడ్ వాదన అని అన్నాడు గౌతమ్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




