Bigg Boss 7 Telugu: ఏడిపించేసిన బిగ్ బాస్.. తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న అశ్విని.. హౌస్‌లో అర్జున్ భార్య సీమంతం

శివాజీని మెడికల్ రూమ్ కు రమ్మన్నాడు బిగ్ బాస్ అక్కడ ఉన్న డాక్టర్ తో తన చేతి నొప్పి గురించి చెప్పాడు. ఆ తర్వాత శివాజీ వెళ్తుండగా ఆ డాక్టర్ నాన్న అని పిలిచాడు. దాంతో శివాజీ అవాక్ అయ్యాడు. తీరా చూస్తే శివాజీ పెద్ద కొడుకు.. దాంతో శివాజీ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆతర్వాత బయటకు తీసుకువచ్చి మై సన్ అంటూ అందరికి పరిచయం చేశాడు.

Bigg Boss 7 Telugu: ఏడిపించేసిన బిగ్ బాస్.. తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న అశ్విని.. హౌస్‌లో అర్జున్ భార్య సీమంతం
Bigg Boss 7 Telugu
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 08, 2023 | 1:04 AM

బిగ్ బాస్ సీజన్ 7 దాదాపు చివరిదశకు వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో సీజన్ 7 ముడిగిపోనుంది. ప్రతి సీజన్స్ లో మాదిరిగానే ఈ సీజన్ లోనూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ను రప్పించి ఏడిపించేశాడు. ముందుగా ఉదయం రిలీజ్ చేసిన ప్రోమోలో హీరో శివాజీని మెడికల్ రూమ్ కు రమ్మన్నాడు బిగ్ బాస్ అక్కడ ఉన్న డాక్టర్ తో తన చేతి నొప్పి గురించి చెప్పాడు. ఆ తర్వాత శివాజీ వెళ్తుండగా ఆ డాక్టర్ నాన్న అని పిలిచాడు. దాంతో శివాజీ అవాక్ అయ్యాడు. తీరా చూస్తే శివాజీ పెద్ద కొడుకు.. దాంతో శివాజీ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆతర్వాత బయటకు తీసుకువచ్చి మై సన్ అంటూ అందరికి పరిచయం చేశాడు. ఇక ఆతర్వాత విడుదల చేసిన ప్రోమోలో హౌస్ లో ఉన్నవారిని ఆట పట్టించాడు బిగ్ బాస్.

ఫ్రీజ్ అని కొందరిని లూప్ అని మరికొందమందిని ఆడించాడు బిగ్ బాస్ చివరిలో అందరిని ఫ్రీజ్ అన్నాడు. అంతలో హౌస్ డోర్స్ ఓపెన్ అవ్వగా అశ్విని తల్లి రమాలోపలికి వచ్చి  అశ్వినిని హగ్ చేసుకున్నారు. అంతే అశ్విని కన్నీళ్లు పెట్టేసుకుంది. కూతురిని చూసి రమా కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు విడిగా కూర్చొని మాట్లాడుకున్నారు. ఏడవద్దు అను అశ్వినిని ఓదార్చింది ఆమె తల్లి. మనవాళ్ళు అని అనుకున్నవాళ్ళు మనవారు కాదు అంటూ అశ్వినికి దైర్యం చెప్పింది. ఆతర్వాత బిగ్ బాస్ రమాను వెళ్ళాలి అని చెప్పగానే వద్దు వెళ్లొద్దు అంటూ ఏడ్చేసింది అశ్విని.

ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలు అంబటి అర్జున్ సతీమణి హౌస్ లోకి వచ్చింది. ఆమెను చూసి అర్జున్ ఆనందంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అర్జున్ సతీమణి గర్భంతో ఉండటంతో ఆమెను అన్ని అడిగి తెలుసుకున్నాడు అర్జున్. నీలో ఉన్న ఎమోషన్స్ అన్ని బయట పెట్టు అంటూ సలహా ఇచ్చింది అర్జున్ భార్య. అలాగే నాకు ఉన్న ఒకే ఒక్క స్టర్స్ నువ్వు రియాక్ట్ అవ్వడం లేదు అని చెప్పింది. కప్పు ఇంపోర్ట్‌టెంట్ బిగిల్ అంటూ నవ్వించింది. ఇదంతా చూసిన శివాజీ దిస్  ఈస్ ద లైఫ్ అంటూ సంబరపడ్డాడు. కడుపులో బేబీ కదులుతుందని నైట్ నిద్రపోనివ్వడం లేదు అని చెప్పింది అర్జున్ భార్య. ఆతర్వాత మా ఆయనంటే భయం పోయిందా అంటూ అశ్వినితో జోక్ చేసింది. ఇక ఆమెకు హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి సీమంతం చేశారు. పసుపు గంధం పూసి , గాజులువేసి ఓ చీరను బహుమతిగా ఇచ్చారు. ఇదంతా చూస్తే ఎమోషనల్ అయ్యాడు అర్జున్. ఈ రోజు ఎపిసోడ్ మరింత ఎమోషనల్ గా సాగనుందని అర్ధమవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.