AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలే.. అంబటి అర్జున్ ఎలిమినేట్ ?.. కలిసిరాని బలం..

నిజానికి అర్జున్ గత రెండు వారాల క్రితం ఎలిమినేట్ కావాల్సింది. అప్పుడే అతడికి అందరికంటే తక్కువ ఓటింగ్ వచ్చిందని.. కానీ ఫినాలే అస్త్ర గెలుచుకోవడంతో అతనికి బదలుగా గౌతమ్ ఎలిమినేట్ అయినట్లు చెప్పారు నాగార్జున. దీంతో అప్పుడే బలం కాదు.. బలగం ముఖ్యమని తెలుసుకున్నాడు అర్జున్. ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పుకొచ్చాడు. నిజానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కాకుండా సీజన్ మొదటిరోజే హౌస్ లోకి అడుగుపెడితే టాప్ 4లో ఉండే కంటెస్టెంట్ అర్జున్.

Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలే.. అంబటి అర్జున్ ఎలిమినేట్ ?.. కలిసిరాని బలం..
Ambati Arjun
Rajitha Chanti
|

Updated on: Dec 16, 2023 | 4:37 PM

Share

మరికొద్ది గంటల్లో బిగ్‏బాస్ సీజన్ 7కు శుభం కార్డు పడనుంది. మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనలిస్ట్స్ అయిన సంగతి తెలిసిందే. అమర్, శివాజీ, ప్రశాంత్, యావర్, అర్జున్, ప్రియాంక టాప్ 6 ఫైనలిస్ట్స్ కాగా.. ఇందులో టైటిల్ రేసులో పోటా పోటిగా దూసుకుపోతున్నది మాత్రం శివాజీ, అమర్, ప్రశాంత్. ముఖ్యంగా ప్రశాంత్, అమర్ మధ్య స్వల్ప ఓటింగ్ తేడా ఉన్నట్లు తెలుస్తోంది. రేపు (డిసెంబర్ 17న) ఈ సీజన్ విన్నర్ ఎవరనేది తెలియనుంది. అయితే ఎప్పుడూ గ్రాండ్ ఫినాలేకు కేవలం ఐదుగురు ఫైనలిస్స్ మాత్రమే ఉంటారు. కానీ ఈసారి ఆరుగురు ఉన్నారు. దీంతో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందనుకున్నారు అడియన్స్. కానీ అటు హోస్ట్ గానీ.. ఇటు బిగ్‏బాస్ గానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఊసే ఎత్తలేదు. దీంతో ఈ 6గురిని ఫైనల్ కు చేర్చనున్నట్లు తెలిసిపోయింది. ఇదిలా ఉంటే.. నిన్నటి ఓటింగ్ క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ రోజు ఉదయమే గ్రాండ్ ఫినాలే షూటింగ్ స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది.

రేపటి ఎపిసోడ్ కోసం ఇవ్వాళ్ల ఉదయం నుంచే ఫినాలే షూటింగ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై యాంకర్ సుమ… తనయుడు రోషన్ , మాస్ మాహారాజా రవితేజ సందడి చేయనున్నట్లు సమాచారం. అలాగే ఈ ఫినాలేకు ముఖ్య అతిథిగా మహేష్ బాబు రానున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఫినాలే ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఆటపాటలు షూటింగ్ పూర్తైందని .. అలాగే ఒక ఎలిమినేషన్ సైతం కంప్లీట్ అయినట్లుగా తెలుస్తోంది. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. అర్జున్ అంబటి ఫస్ట్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది.

నిజానికి అర్జున్ గత రెండు వారాల క్రితం ఎలిమినేట్ కావాల్సింది. అప్పుడే అతడికి అందరికంటే తక్కువ ఓటింగ్ వచ్చిందని.. కానీ ఫినాలే అస్త్ర గెలుచుకోవడంతో అతనికి బదలుగా గౌతమ్ ఎలిమినేట్ అయినట్లు చెప్పారు నాగార్జున. దీంతో అప్పుడే బలం కాదు.. బలగం ముఖ్యమని తెలుసుకున్నాడు అర్జున్. ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పుకొచ్చాడు. నిజానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కాకుండా సీజన్ మొదటిరోజే హౌస్ లోకి అడుగుపెడితే టాప్ 4లో ఉండే కంటెస్టెంట్ అర్జున్. ప్రతి టాస్కులోనూ అదరగొట్టేశాడు. కండబలం కాదు.. బుద్దిబలం కూడా ముఖ్యమే అని నిరూపించుకున్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో అమర్ గురించి మాట్లాడడం.. శివాజీని నామినేట్ చేయడంతో అతడికి ఓటింగ్ తగ్గిపోయింది.

టాస్కులలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చినా.. టాప్ 5లో మాత్రం స్థానం సంపాదించుకోలేకపోయాడు అర్జున్. ఇక ఫినాలే అస్త్ర గెలవడంలో మరొకరి సహయం తీసుకోకుండా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నాడు. కానీ టాప్ 3లో మాత్రం ప్రశాంత్, అమర్, శివాజీ ఓటింగ్ లో దూసుకుపోతున్నారు. ఆ తర్వాతి స్థానంలో యావర్ ఉండగా.. ప్రియాంక, అర్జున్ ఇద్దరికీ తక్కువ ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది.