Amardeep Chowdary: మంచి మనసు చాటుకున్న అమర్ దీప్.. ట్రస్ట్‌కు చెందిన పేద పిల్లలకు, మహిళలకు సాయం
అమర్ దీప్ ఫ్యాన్స్, ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య పెద్ద గొడవే జరిగింది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పేరుతో కొంతమంది అమర్ దీప్ కారు పై దాడి చేశారు. అమర్ దీప్ తో పాటు మరికొంతమంది సెలబ్రెటీల కార్ల పై అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు పై కూడా దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. దాంతో చాలా మంది దీని పై విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే తన పై జరిగిన దాడి గురించి స్పందించాడు.
బిగ్ బాస్ సీజన్ 7 గత సీజన్స్ తో పోల్చుకుంటే మంచి టీఆర్పీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. బిగ్ బాస్ 7 విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అలాగే రన్నరప్ గా అమర్ దీప్ నిలిచాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 కంటే ఫినాలే రోజు జరిగిన రచ్చే హాట్ టాపిక్ గా మారింది. అమర్ దీప్ ఫ్యాన్స్, ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య పెద్ద గొడవే జరిగింది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పేరుతో కొంతమంది అమర్ దీప్ కారు పై దాడి చేశారు. అమర్ దీప్ తో పాటు మరికొంతమంది సెలబ్రెటీల కార్ల పై అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు పై కూడా దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. దాంతో చాలా మంది దీని పై విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే తన పై జరిగిన దాడి గురించి స్పందించాడు.
దన పై జరిగిన దాడి పై ఆవేదన వ్యక్తం చేశాడు అమర్ దీప్. కారు పై దాడి చేశారని ఆ కారులో తన తల్లి,భార్య కూడా ఉన్నారు అని తెలిపాడు. ఇలాంటి చేయడం కరెక్ట్ కాదు అని అన్నాడు. అలాగే ఏదైనా ఉంటే తనతో పెట్టుకోవాలి అని ఫ్యామిలీ జోలికి రావద్దు అని తెలిపాడు. ఇదిలా ఉంటే అమర్ దీప్ ప్రస్తుతం అనంతపూర్ లో ఉన్నాడు. బిగ్ బాస్ తర్వాత తన సొంత ఊరు అయినా అనంతపూర్ కు వెళ్ళిపోయాడు.
తాజాగా అమర్ ఫ్యామిలీతో కలిసి సేవ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఓ ట్రస్ట్ కు చెందిన పిల్లలకు, మహిళకు దుప్పట్లు పంచిపెట్టారు. అలాగే వారికి భోజనాలు వడ్డించారు. చిన్నపిల్లలతో కలిసి కేక్ కూడా కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అమర్ తల్లి, భార్య తేజస్విని పాల్గొన్నారు. దేవుడికి నాకు ఇచ్చిన శక్తిమేరకు తప్పకుండా సాయం చేస్తూనే ఉంటాను అని తెలిపాడు అమర్ దీప్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.