బిగ్‌బాస్ హౌస్‌లో గత రెండు రోజులుగా వరుస పెట్టి టాస్కులు జరుగుతున్నాయి. ఫినాలే అస్త్ర టికెట్ కోసం హౌస్మేట్స్ పోటీపడుతున్నారు. ఇప్పటివరకు మూడు టాస్కులు జరగ్గా.. అత్యధిక పాయింట్లతో టాప్ లో అమర్ ఉండగా.. రెండవ స్థానంలో అర్జున్ ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో యావర్, ప్రశాంత్ ఉన్నారు. ఇక ఇప్పటికే ఫినాలే రేసు నుంచి శోభా, శివాజీ అవుట్ అయ్యారు. ఇక ఈరోజు ప్రోమో రిలీజ్ అయ్యింది. తాజాగా వీడియోలో ఫినాలే రేసు నుంచి అవుట్ కావడంతో శోభా ఏడుస్తూనే ఉంది. స్కోర్ బోర్డు నుంచి తన ఫోటోలను తీసేసింది. దీంతో అలా తీయకూడదు శోభా అంటూ అమర్, ప్రియాంక చెప్పడంతో … నేను తట్టుకోలేకపోతున్నాను.. రాత్రి నుంచి అదే మైండ్ లో ఉండిపోయింది. ఉదయం కూడా చూడలేకపోతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది శోభా. అయితే సరేలే ఏడవకు తీసెయ్ అని అమర్ చెప్పడంతో స్కోర్ బోర్డు నుంచి తన ఫోటోలను తీసేసింది. ఇక ఆ తర్వాత ఫినాలే అస్ట్ర కోసం మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.
ఎత్తర జెండా అనే టాస్క్ ఇచ్చి.. దీనికి శోభా శెట్టి, శివాజీలను సంచాలకులుగా నియమించారు. అయితే ఒక్కొక్కరికి కేటాయించిన పడవను ఇసుకతో నింపితే.. వారి పడవకు మరో పక్కనున్న జెండా పైకి లేస్తుంది. ఎవరి జెండా అయితే ముందే పైకి లేస్తుందో వారే విజేతలు. అయితే ఈ ఇసుకను కేవలం చిన్న జగ్గుతో మాత్రమే తీసుకొచ్చి పడవలో పోయాల్సి ఉంటుంది. ఇక ఈటాస్కులో అశ్వద్ధామా 2.0 అదేనండి డాక్టర్ బాబు అతి తెలివి చూపించాడు. అందరిలాగే ఇసుక తీసుకురావడం ఆపేసి.. పడవకు మరో సైడ్ ఉన్న ఇసుకను ఇటువైపు పోయడం స్టార్ట్ చేశాడు. దీంతో ఏం చేస్తున్నావ్ అంటూ శివాజీ అడిగితే.. ఇసుక పోయమని చెప్పారంతే.. తెచ్చి పోయాలని చెప్పలేదు అని అన్నాడు. దీంతో సంచాలక్ శోభా.. ఇది నేను ఒప్పుకోను.. ఇది ఫౌల్ గేమ్ అంటూ ఖండించింది.
అయితే ఇక్కడ సంచాలకులుగా ఉన్న శివాజీ, శోభాలతో వాదించాడు గౌతమ్. ఇది ఫౌల్ గేమ్ కాదు.. ముందు మీరు రూల్స్ చదవండి అంటూ అతి తెలివి చూపించాడు. దీంతో మధ్యలోనే బిగ్ బాస్ కల్పించుకుని డాక్టర్ బాబుకు షాకిచ్చాడు. జెండా వైపు నుంచి ఎంత ఇసుకను తీశారో మళ్లీ అటు వైపు నింపండి అని అన్నారు. దీంతో సైలెంట్‌గా తను తీసిన ఇసుకను తీస్తున్నాడు గౌతమ్. అయితే గౌతమ్ ఇసుక తీయడాన్ని శివాజీ దగ్గరుండి గమనించడంతో ప్రోమో ముగిసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.