బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో హౌస్ లోకి వచ్చిన 19మంది కంటెస్టెంట్స్ లో ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో సరయు, రెండో వారంలో ఉమా దేవి, మూడోవారంలో లహరి.. అలాగే రీసెంట్ గా నటరాజ్ మాస్టర్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. దాంతో ఇప్పుడు హౌస్ లో 15మంది ఉన్నారు. ఇక ఇంటిసభ్యుల మధ్య గొడవలు, ఏడుపులు, గందరగోళంగా సాగుతుంది. ఇక 5వ్ తేదీన.. అంటే సోమవారం నటి ఎపిసోడ్ లో రచ్చ కంటిన్యూ అయ్యింది.. యాంకర్ రవిని నామినేట్ చేసింది ఆర్జే కాజల్. ఆ బాధలో రవి ఉంటే.. కాజల్ వాళ్ల దగ్గరకు వెళ్లి అత్యుత్సాహం చూపించింది. నిజానికి కాస్త ఎక్కువే చేసింది అని చెప్పాలి. వాష్ రూం వర్క్ నుంచి కిచెన్‌కి రవి, లోబోలు షిఫ్ట్ కావడంతో ఎగతాళిగా మాట్లాడుతూ డాన్స్ చేసింది కాజల్.
దాంతో లోబో కాజల్ పైన కోపం వ్యక్తం చేశాడు.. చేతి ఫింగర్ చూపిస్తూ కాజల్ కు చెప్పకనే చెప్పాడు లోబో దాంతో కాజల్ కు సీన్ అర్ధమైంది .. దాంతో కాజల్ మాట్లాడుతూ.. ‘లోబో అన్నీ చూస్తున్నా.. నువ్ ఏం చేస్తున్నావో అన్నీ చూస్తున్నా.. ఓవరాక్షన్ చేయకు’.. అని అంటుంది.. దీంతో లోబో ‘నేను ఏం అన్నా ఇప్పుడు’? అని అంటాడు. ‘ఏం అనలేదు.. చేశావ్.. అది నేను చూశాను.. అని అంటుంది కాజల్. పైకి వేలు చూపించా? అంతేగా అని అంటదు లోబో. ఇప్పుడు ఏ ఫింగర్ చూపించావో.. ఇంతకు ముందు ఏ ఫింగర్ చూపించావో నేను చూశాను అని అంటుంది కాజల్. నువ్ ఏ ఫింగర్ చూపించావో.. బిగ్ బాస్ ను అడిగి వీడియో చూపించనా? అని అంటుంది కాజల్. దాంతో నేను అలా చేయలేదు కావాలంటే నీకు పేపర్‌పై రాసిస్తా అని అంటాడు లోబో. సర్లే నువ్ ఇంతలా చెప్తున్నావ్ కాబట్టి.. కావాలని చేయలేదని వదిలేస్తున్నా అని అంటుంది కాజల్.
మరిన్ని ఇక్కడ చదవండి :