Tollywood: నీ రూపం మా గుండెల్లో చిరస్మరణీయం.. ఈ హీరో ఎవరో తెలిస్తే కన్నీళ్లు పెట్టకుండ ఉండలేరు..

|

Dec 12, 2024 | 8:58 AM

సినీరంగుల ప్రపంచంలో అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. బుల్లితెరపై అతడో సూపర్ స్టార్. కానీ నటుడిగా కెరీర్ మంచి క్రేజ్ లో ఉన్న సమయంలోనే ఊహించని సంఘటన. నటుడిగా సినిమాల్లో రాణిస్తాడనుకున్న అతడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

Tollywood: నీ రూపం మా గుండెల్లో చిరస్మరణీయం.. ఈ హీరో ఎవరో తెలిస్తే కన్నీళ్లు పెట్టకుండ ఉండలేరు..
Actor
Follow us on

సినీప్రియుల అభిమాన హీరో. అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు. అతడి పేరు చెబితే ఇప్పటికీ అడియన్స్ కళ్లు చెమ్మగిల్లుతాయి. కొన్ని సంవత్సరాల క్రితమే అతడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. కానీ ఎప్పటికీ అభిమానుల గుండెల్లో అతడి రూపం చిరస్మరణీయం. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నోడిని గుర్తుపట్టారా.. ? ఈరోజు అతడి జయంతి. ఈ సందర్భంగా తమ అభిమాన హీరోను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? ఆ చిన్నోడు మరెవరో కాదండి.. హిందీ బుల్లితెర సూపర్ స్టార్ సిద్ధార్థ్ శుక్లా. చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ శివ అలియాస్ సిద్ధార్థ్ శుక్లా.

వెండితెరపై అద్భుతమైన నటనతో మెప్పించిన సిద్ధార్థ్ చిన్న వయస్సులోనే జీవిత యుద్ధంలో ఓడిపోయాడు. సిద్ధార్థ్ 1980 డిసెంబర్ 12న ముంబైలో జన్మించాడు. తండ్రి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారిగా పనిచేసిన సివిల్ ఇంజనీర్. తల్లి రీటా శుక్లా గృహిణి. 6 ఏళ్ల వయసులోనే తన తండ్రిని కోల్పోయాడు సిద్ధార్థ్. దీంతో అతడిని తన తల్లి, అక్క ఎంతో అల్లారుముద్దుగా చూసుకున్నారు. సిద్ధార్థ్ ఇంటీరియర్ డిజైనర్‌లో బ్యాచిలర్స్ చదివాడు. అలాగే టెన్నిస్, ఫుట్ బాల్ ప్లేయర్. అండర్ 19 ఫుట్‌బాల్ క్లబ్‌లో కూడా సభ్యుడు. సిద్ధార్థ్ కొన్ని సంవత్సరాలు ఇంటీరియర్ డిజైనర్‌గా కూడా పనిచేశాడు. కానీ తన తల్లి కోరిక మేరకు సినీరంగంలోకి అడుగుపెట్టాడు. 2004లో గ్లాడ్రాగ్స్ మాన్‌హంట్, మెగామోడల్ కాంటెస్ట్‌లలో రన్నరప్ గా నిలిచాడు. ఆ తర్వాత అరుణ్ మ్యూజిక్ వీడియో ‘రేషమ్ కా రుమాల్’లో సిద్ధార్థ్ మొదటిసారి కనిపించాడు.

ఇవి కూడా చదవండి

2005లో, సిద్ధార్థ్ వరల్డ్స్ బెస్ట్ మోడల్ కాంటెస్ట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ పలు బ్రాండ్లకు ప్రకటనలు కూడా చేశాడు. సిద్ధార్థ్‌కి ‘బాబుల్ కా ఆంగన్ ఛోటే నా’ (2008)లో నటుడిగా మొదటి అవకాశం వచ్చింది. ఆ తర్వాత చాలా సీరియల్స్ చేశాడు. కానీ అతడికి బాలిక వధు (చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్ ద్వారా ఎక్కువ క్రేజ్ వచ్చింది. ఈ సీరియల్ ద్వారా తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. 2019లో బిగ్ బాస్ సీజన్ 13లో పాల్గొని విజేతగా నిలిచాడు. అదే సమయంలో తోటి కంటెస్టెంట్ షెహనాజ్ గిల్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరి జోడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. బిగ్ బాస్ షో తర్వాత అతడికి మరింత గుర్తింపు వచ్చింది. దీంతో సినిమాల్లో ఆఫర్స్ కూడా వచ్చాయి. ఎన్నో ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురైన తుదిశ్వాస విడిచాడు. సెప్టెంబర్ 2, 2021న గుండెపోటుతో మరణించాడు. అతడి మరణ వార్త విని సినీ ఇండస్ట్రీతోపాటు అభిమానులు షాకయ్యారు. ఇప్పటికీ సిద్ధార్థ్ శుక్లాను గుర్తుచేసుకుంటూ నెట్టింట వరుస పోస్టులు చేస్తుంటారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.