Bhola Shankar: భోళా శంకర్ ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది.. ఎలా ఉందంటే..

|

Jun 02, 2023 | 6:19 PM

కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ కోల్ కత్తాలో శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫోటోస్ మూవీపై ఆసక్తిని పెంచాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా పాటల సందడి షూరు అయ్యింది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. తాజాగా మొదటి సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.

Bhola Shankar: భోళా శంకర్ ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది.. ఎలా ఉందంటే..
Bhola Mania
Follow us on

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం భోళా శంకర్. దాదాపు పదేళ్ల తర్వాత డైరెక్టర్ మెహర్ రమేశ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇందులో మరోసారి ట్యాక్సీ డ్రైవర్‏గా కనిపించనున్నారు చిరు. అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా, కీర్తి సురేష్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ కోల్ కత్తాలో శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫోటోస్ మూవీపై ఆసక్తిని పెంచాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా పాటల సందడి షూరు అయ్యింది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. తాజాగా మొదటి సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.

చిరు పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ నుంచి భోళా మేనియా అనే పల్లవితో సాగ్ మాస్ బీట్ సాంగ్ ప్రోమోను శుక్రవారం సాయంత్రం రిలీజ్ చేశారు మేకర్స్. సాంగ్ అయితే అదిరిపోయింది. ఇక జూన్ 4న విడుదల కాబోయే ఫుల్ సాంగ్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయంగా తెలుస్తోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. దాంతో భోళాశంకర్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏకే ఎంటర్టైనమెట్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు లేటెస్ట్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.