Bheemla Nayak : బుక్ మై షో కు షాక్ ఇచ్చిన భీమ్లానాయక్ డిస్టిబ్యూటర్స్.. కారణం ఇదే.

పవర్ స్టార్ పవన్ కళ్యణ్ నటిస్తున్న సినిమా భీమ్లానాయక్. ఈ మూవీ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Bheemla Nayak : బుక్ మై షో కు షాక్ ఇచ్చిన భీమ్లానాయక్ డిస్టిబ్యూటర్స్.. కారణం ఇదే.
Bheemla Nayak

Updated on: Feb 20, 2022 | 3:41 PM

Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యణ్ నటిస్తున్న సినిమా భీమ్లానాయక్. ఈ మూవీ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే తోపాటు మాటలను అందిస్తున్నారు. భీమ్లానాయక్ సినిమా ఫ్రిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన ఈమూవీ పాటలు, పోస్టర్స్ , గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈక్రమంలో భీమ్లానాయక్ సినిమా ప్రీరీలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరపనున్నారు. హైదరాబాద్ లో పోలీస్ గ్రౌండ్స్ లో ఫిబ్రవరి 21న ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా కేటీఆర్ తోపాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరుకానున్నారు.

ఇదిలా ఉంటే బుక్ మై షో కి నైజాంలో ఎదురుదెబ్బ తగిలింది. బుక్ మై షో ద్వారా టికెట్ లు అమ్మకూడదని డిసైడ్  అయ్యారు భీమ్లా నాయక్ డిస్ట్రిబ్యూటర్. బుక్ మై షో కారణంగా ప్రేక్షకుల మీద అదనపు భారం పడుతోందనే విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణలో టికెట్ రేట్లు భారీగా పెరిగాయి. దానికి బుక్ మై షో కమిషన్ కలిపితే రేటు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందుకని కౌంటర్ సేల్ చేస్తే బెటర్ అని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బుక్ మై షో యాజమాన్యం వసూలు చేసే సర్వీస్ ఛార్జి, సినిమా ప్రకటనలు రేట్లు తగ్గించే విధంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అందుకే ఈ విషయం సెటిల్ అయ్యే వరకు థియేటర్ కౌంటర్లో టికెట్స్ విక్రయించాలని భావిస్తున్నారు డిస్టిబ్యూటర్లు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sitara Ghattamaneni: సీతూ పాప స్టెప్పులకు మహేష్ ఫిదా.. కళావతి పాటకు అదరగొట్టిన సితార..

Viral Photo: చారడేసి కళ్లు.. బూరె బుగ్గల ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. బుల్లితెరపై ఈ చిన్నదానిదే హవా..

Shaakuntalam: ఎట్టకేలకు సమంత ఫస్ట్ లుక్ రిలీజ్!!.. శాకుంతలం సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..