Thalapathy Vijay: లియో కంటే ముందే విజయ్ మరో సినిమా.. అసలు విషయం ఏంటంటే

'లియో' సినిమా విడుదలకు మరికొద్ది రోజులే ఉంది. చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో సంజయ్ దత్ విలన్. త్రిష కథానాయిక. 16 ఏళ్ల తర్వాత విజయ్, త్రిష కలిసి నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఇపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మోనెనే మధ్య విడుదలైన ఈ సినిమా పోస్టర్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమాను లోకేష్ కానగరాజ్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు లోకేష్ గతంలో తెరకెక్కించిన ఖైదీ, విక్రమ్ సినిమాలకు లింక్ ఉంటుందని టాక్. 

Thalapathy Vijay: లియో కంటే ముందే విజయ్ మరో సినిమా.. అసలు విషయం ఏంటంటే
Thalapathy Vijay
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 28, 2023 | 9:22 AM

తమిళ్ ఇండస్ట్రీ సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతుంది. కమల్ హాసన్ ‘విక్రమ్’ సూపర్ హిట్ అయ్యింది, సూపర్ స్థార్ రజనీకాంత్ ‘జైలర్’ సూపర్ డూపర్  హిట్ అయ్యింది . ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు అందరి చూపు విజయ్ నటిస్తున్న ‘లియో’ సినిమాపై పడింది. ‘లియో’ సినిమా విడుదలకు మరికొద్ది రోజులే ఉంది. చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో సంజయ్ దత్ విలన్. త్రిష కథానాయిక. 16 ఏళ్ల తర్వాత విజయ్, త్రిష కలిసి నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఇపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మోనెనే మధ్య విడుదలైన ఈ సినిమా పోస్టర్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమాను లోకేష్ కానగరాజ్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు లోకేష్ గతంలో తెరకెక్కించిన ఖైదీ, విక్రమ్ సినిమాలకు లింక్ ఉంటుందని టాక్. ‘లియో’ సినిమా అక్టోబర్ 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా కంటే ముందే మరో సినిమాను మొదలు పెట్టనున్నారట దళపతి. విజయ్ 68వ సినిమా షూటింగ్ అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. గాంధీ జయంతి సందర్భంగా తొలి క్లాప్ కొట్టేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ‘లియో’ సినిమా విడుదలకు ముందే విజయ్ కొత్త సినిమా స్టార్ట్ చేయడంతో విజయ్ ఫ్యాన్స్‌ షాక్ అవుతున్నారు.

‘లియో’ సినిమా ప్రమోషన్‌లో విజయ్ బిజీగా ఉంటాడని అభిమానులు అంచనా వేశారు. అయితే ప్రమోషన్‌కు ఇబ్బంది లేకుండా విజయ్ కొత్త సినిమా షూటింగ్‌ని ప్రారంభించనున్నదని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ‘లియో’ సినిమా ట్రైలర్ లాంచ్ జరగనుందని, ఆ ఈవెంట్ లో మాత్రమే విజయ్ పాల్గొంటాడని అంటున్నారు. విజయ్ 68వ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్నారు. విజయ్ గత సినిమాల తరహాలో ఇందులో కూడా యాక్షన్ కథ ఉంటుంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. విజయ్ కొత్త సినిమాలో ఎస్.జె.సూర్య కూడా ప్రధాన పాత్ర పోషిస్తాడని అంటున్నారు, అయితే ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో కనిపిస్తాడా లేదా అనేది క్లారిటీ లేదు. అలాగే ఈ సినిమాలో నటుడు ప్రభుదేవా కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడని సమాచారం. అన్బరవి ఈ చిత్రానికి యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించనున్నారు. ఆయనే ‘లియో’ చిత్రానికి ఫైట్ కొరియోగ్రఫీ కూడా చేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.