RRR, Pushpa: ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాల పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు.. మండిపడుతున్న నెటిజన్స్

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వెయ్యి కోట్ల రూపాయల క్లబ్‌లో చేరగా, ‘పుష్ప’ చిత్రం 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. పాన్ ఇండియా సినిమాలైనా ఈ రెండు సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాయి. అలాగే విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటకు ఏకంగా ఆస్కార్‌ దక్కింది. అయితే కొంతమంది ఆర్ఆర్ఆర్ సినిమా పైవిమర్శలు చేసిన విషయం తెలిసిందే. విడుదలకు ముందు విడుదల తర్వాత కూడా ఆర్ఆర్ఆర్ సినిమా పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు.

RRR, Pushpa: ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాల పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు.. మండిపడుతున్న నెటిజన్స్
Rrr, Pushpa
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 28, 2023 | 11:04 AM

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ‘పుష్ప’ సినిమాలు భారీ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. అంతే కాదు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టాయి. ఈ రెండు సినిమాలు మంచి బిజినెస్ కూడా  చేశాయి. ‘ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వెయ్యి కోట్ల రూపాయల క్లబ్‌లో చేరగా, ‘పుష్ప’ చిత్రం 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. పాన్ ఇండియా సినిమాలైనా ఈ రెండు సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాయి. అలాగే విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటకు ఏకంగా ఆస్కార్‌ దక్కింది. అయితే కొంతమంది ఆర్ఆర్ఆర్ సినిమా పైవిమర్శలు చేసిన విషయం తెలిసిందే. విడుదలకు ముందు విడుదల తర్వాత కూడా ఆర్ఆర్ఆర్ సినిమా పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు.

అయితే బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా కూడా ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాల పై సంచలన కామెంట్స్ చేశాడు. సినిమాల పై ఒకొక్కరికి ఒకొక్క అభిప్రాయం ఉంటుంది. గతంలోనూ చాలా సూపర్ హిట్ సినిమాల ఫై కొందరి నెగిటివ్ కామెంట్స్ చేశారు. మన దగ్గర అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా పై కూడా విమర్శలు చేశారు. ఇప్పుడొస్తున్న సినిమాల్లో హీరోయిజం తప్ప ఏ మీ ఉండటం లేదు అని అన్నారు. హాలీవుడ్ లో అలాంటి సూపర్ హీరోల సినిమాలు వస్తుంటాయి. మనదగ్గర కూడా ఇప్పుడు అలాంటి సినిమాలే వస్తున్నాయి అన్నారు.

తాజాగా నసీరుద్దీన్ షా మాట్లాడుతూ.. కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘ యంగ్ హీరోల పై నాకు చాలా నమ్మకం ఉంది. వారు మనకంటే ఎక్కువ అభివృద్ధి చెందారు, వాళ్ళు చాలా తెలివైన వారు కూడా అన్నారు. కానీ కొన్ని సినిమాలు చూస్తే థ్రిల్‌ తప్ప మరేమీ రాదు. ఆర్ఆర్ఆర్ చూడాలని ప్రయత్నించాను. కానీ చూడలేకపోయాను . పుష్ప సినిమా కథ కూడా అదే. మణిరత్నం సినిమాలన్నీ చూస్తాను. ఎందుకంటే వారు చాలా మంచి సినిమాలు చేస్తారు. ఆయన సినిమాల్లో ఎజెండా ఉండదు’ అని అన్నారు. అయితే నసీరుద్దీన్ షా పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. దేశం గర్వించదగ్గ సినిమాల పై ఆయన కామెంట్స్ చేయడం పై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. సినిమాలు చూడకుండానే ఎలా తప్పుబడతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.