Bangalore Rave Party: బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు నోటీసులు.. విచారణకు రావాల్సిందే..

బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా జీఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డితోపాటు.. టాలీవుడ్ నటి హేమకు నోటీసులు జారీ చేశారు బెంగళూరు పోలీసులు. 27వ తేదీన విచారణ కు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. హేమతో పాటు చిరంజీవి, కాంతి, రాజశేఖర్, సుజాత, ఆశీ రాయ్, రిషి చౌదరి, ప్రసన్న కుమార్, శివాని జైస్వాల్ వరుణ్

Bangalore Rave Party: బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు నోటీసులు.. విచారణకు రావాల్సిందే..
Telugu Actress Hema
Follow us
Rajitha Chanti

|

Updated on: May 25, 2024 | 1:20 PM

బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చినవారికి బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జీఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డితోపాటు.. టాలీవుడ్ నటి హేమకు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 86 మందికి నోటీసులు జారీ చేశారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. 27వ తేదీన బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. హేమతో పాటు చిరంజీవి, కాంతి, రాజశేఖర్, సుజాత, ఆశీ రాయ్, రిషి చౌదరి, ప్రసన్న కుమార్, శివాని జైస్వాల్ వరుణ్ చౌదరి కి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.

ఈ కేసులో A2గా అరుణ్ కుమార్, A4గా రణధీర్ బాబు పేర్లను నమోదు చేశారు పోలీసులు. రణధీర్ బాబు డెంటిస్ట్ గా గుర్తించారు. అలాగే అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తించారు. జీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో 100 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇందులో అత్యధికంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందినవారే ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మొన్నటి వరకు రేవ్ పార్టీ గురించి తమకు ఏం తెలియదని..అసలు ఆ పార్టీకి వెళ్లలేదు.. బర్త్ డే పార్టీ అనుకున్నామంటూ ఆస్కార్ లెవల్లో పర్ఫామెన్స్ ఇచ్చిన టాలీవుడ్ తారలకు ఇప్పుడు బెంగుళూరు పోలీసులు షాకిచ్చారు. ఈనెల 27న విచారణకు హాజరు కావాల్సిందేనని నోటీసులు జారీ చేశారు. మే 19న సాయంత్రం 5 గంటల నుంచి ఈ రేవ్ పార్టీ జరిగిందని పోలీసులు తెలిపారు. తమకు ఫిర్యాదు రావడంతో రాత్రి 11.30 గంటల సమయంలో ఫామ్ హౌస్ రైడ్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.