AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Hema: డ్రగ్స్ తీసుకున్న హేమ.. నార్కోటిక్ టెస్టులో నిర్ధారణ

బెంగళూరు శివార్లలో ఇటీవల జరిగిన రేవ్ పార్టీ తెలుగునాట సంచలనంగా మారింది. ఈ పార్టీలో పలువురు తెలుగు నటీనటులు పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. తాజాగా కేసులో కీలక ట్విస్ట్ ఎదురైంది.

Actress Hema: డ్రగ్స్ తీసుకున్న హేమ.. నార్కోటిక్ టెస్టులో నిర్ధారణ
Telugu Actress Hema
Ram Naramaneni
|

Updated on: May 23, 2024 | 1:12 PM

Share

బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది.. బెంగళూరు డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నార్కోటిక్స్ బృందం గుర్తించింది. అందులో నటి హేమ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు నార్కోటిక్ టీమ్ రిపోర్ట్ సమర్పించింది. ఆ రోజు రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మంది బ్లడ్ శాంపిల్స్ నార్కోటిక్ టీమ్ సేకరించింది. ఇందులో 57 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంటే మొత్తం 86 మందికి ఈ పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు. హేమ స్నేహితుడు చిరంజీవి కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.  అయితే హేమతో పాటు వీరందరినీ బాధితులుగా పరిగణించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది. కాగా తన పేరు బయటికి రాకుండా హేమ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. ఆమె పేరు మార్చుకొని.. కృష్ణవేణి పేరుతో పార్టీకి అటెండ్ అయినట్లు తెలిసింది.

బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్‌ పార్టీకి సినీ నటి హేమ అటెండ్‌ అయ్యారంటూ తొలుత కన్నడ మీడియా కోడై కూసింది. ఆ పార్టీకి తాను వెళ్లనే వెళ్లలేదు అన్నారు సినీ నటి హేమ. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని, ఓ ఫామ్‌హౌస్‌లో చిల్‌ అవుతున్నానని చెప్పారు ఆమె. అదంతా ఫేక్‌ న్యూస్‌ నమ్మొద్దండి అంటూ నవ్వుతూ చెప్పారు. తన మాటలకు సాక్ష్యంగా ఓ వీడియో కూడా విడుదల చేశారు. అయితే హేమ రేవ్ పార్టీకి వచ్చారంటూ బెంగళూరు పోలీసులు ఫొటోలు రిలీజ్ చేశారు. రేవ్‌ పార్టీకి తాను వెళ్లలేదంటూ హేమ చేసిన వీడియోలో ఏ డ్రస్‌తో ఉన్నారో, బెంగళూరు పోలీసులు విడుదల చేసి ఫొటోలోనూ అదే డ్రస్‌లో కనిపించారు. డ్రెస్‌ మ్యాచ్ అయింది. హేమ మాటలు తూచ్‌ అయ్యాయి. చివరకు ఆమె ఆ పార్టీలో పాల్గొందని బెంగళూరు కమిషనరే కన్ఫామ్ చేశారు. ఆ తర్వాత రోజు హైదరాబాద్ వచ్చిన హేమ.. బిర్యానీ వండుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు.  సుప్పిని.. సుద్దపూసని తనకేం తెలియదు అన్నట్లు బిహేవ్ చేశారు.  అబద్ధాలు చెప్పడంతో హేమపై బెంగళూరు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. తాజాగా నార్కోటిక్ టెస్టులో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ.12 వేలకే మతిపోయే ఫోన్.. ఫీచర్లు చూస్తే వామ్మో అంటారు
రూ.12 వేలకే మతిపోయే ఫోన్.. ఫీచర్లు చూస్తే వామ్మో అంటారు
శీతాకాలం స్పెషల్.. రాజస్థాన్‎లో ఈ ప్లేసులు సూపర్.. వెళ్లారంటే..
శీతాకాలం స్పెషల్.. రాజస్థాన్‎లో ఈ ప్లేసులు సూపర్.. వెళ్లారంటే..
పొరపాటున కూడా వీటిని మళ్లీ వేడి చేసి తినకండి..
పొరపాటున కూడా వీటిని మళ్లీ వేడి చేసి తినకండి..
మీ ఇష్టమైన రొయ్యల వేపుడు.. హోటల్ స్టైల్‎లో మీ ఇంట్లో చేసుకోండిలా.
మీ ఇష్టమైన రొయ్యల వేపుడు.. హోటల్ స్టైల్‎లో మీ ఇంట్లో చేసుకోండిలా.
చీప్‌గా వస్తుందని వీటిని తెగ వాడేస్తున్నారా?.. అంతే సంగతులు!
చీప్‌గా వస్తుందని వీటిని తెగ వాడేస్తున్నారా?.. అంతే సంగతులు!
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్స్‌లో మార్పులు..!
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్స్‌లో మార్పులు..!
IPL 2026 Auction: రికార్డ్ ప్రైజ్ కోసం మైండ్ బ్లోయింగ్ స్కెచ్
IPL 2026 Auction: రికార్డ్ ప్రైజ్ కోసం మైండ్ బ్లోయింగ్ స్కెచ్
ఆంధ్ర స్పెషల్.. గోంగూర చికెన్ కర్రీ.. మీ కిచెన్‎లో సింపుల్‎గా..
ఆంధ్ర స్పెషల్.. గోంగూర చికెన్ కర్రీ.. మీ కిచెన్‎లో సింపుల్‎గా..
ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగళం.. అంతకుముందే వలలో చిక్కి..
ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగళం.. అంతకుముందే వలలో చిక్కి..
బీపీ పేషెంట్లకు వరం.. ఇలా చేస్తే రక్తపోటు పరార్!
బీపీ పేషెంట్లకు వరం.. ఇలా చేస్తే రక్తపోటు పరార్!