Bandla Ganesh: బండ్ల గణేష్ కూతురిని చూశారా? కుందనపు బొమ్మలా ఉంది.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరో సంచలనానికి తెరలేపారు. ఏపీ సీఎం చంద్రబాబు అరెస్టయిన సమయంలో ఆయన అనుకున్న మొక్కును తీర్చుకునేందుకు షాద్‌నగర్‌ నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. సంకల్ప యాత్ర పేరిట సోమవారం (జనవరి 19) ప్రారంభమైన ఈ పాదయాత్రలో బండ్లన్న కూతురు కూడా కనిపించింది.

Bandla Ganesh: బండ్ల గణేష్ కూతురిని చూశారా? కుందనపు బొమ్మలా ఉంది.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
Bandla Ganesh

Updated on: Jan 19, 2026 | 8:55 PM

టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటుడిగా మెప్పించాడు బండ్ల గణేష్. సూర్య వంశం, సుస్వాగతం, సాంబయ్య, మనసులో మాట, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, ఆంధ్రావాలా, పోకిరి, 143 తదితర సూపర్ హిట్ సినిమాలు బండ్ల గణేష్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక నటుడిగానూ సక్సెస్ అయ్యాడు బండ్లన్న. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ను స్థాపించి పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు. ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, టెంపర్, బాద్ షా, ఇద్దరమ్మాయిలతో, గోవిందుడు అందరి వాడేలే సినిమాలు బండ్లన్న నిర్మాణ సారథ్యంలో తెరకెక్కినవే. స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగే క్రమంలోనే రాజకీయాలు, ఇతరత్రా కారణాలతో సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఫుల్ టైమ్ కమెడియన్ గా కనిపించి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అలాగే డేగల బాబ్జీ అనే సినిమాలో హీరోగానూ కనిపించాడు.

గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న బండ్ల గణేష్ మళ్లీ ఇప్పుడు నటునిగా బిజీ అవుతున్నాడు. అలాగే తన ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా సినిమా ఈవెంట్లలో అతను ఇచ్చే స్పీచ్ లకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ గురించి బండ్లన్న ఇచ్చిన స్పీచ్ లు ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు.

తాజాగా మరో సాహసోపేతమైన యాత్రకు శ్రీకారం చుట్టాడు బండ్ల గణేష్. గతంలో సీఎం చంద్రబాబు అరెస్టయిన సమయంలో అనుకున్న మొక్కును తీర్చుకునేందుకు షాద్‌నగర్‌ నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. సుమారు 500 కిలోమీటర్ల సాగే ఈ యాత్రకు సంకల్ప యాత్ర అని నామకరణం చేశారు. సోమవారం (జనవరి 19) ఉదయం ఈ పాదయాత్ర ప్రారంభం కాగా అంతకు ముందు షాద్ నగర్ ఆలయంలో పూజలు చేశాడు బండ్ల గణేష్. ఈ సమయంలో బండ్లన్న వెంట అతని భార్య, కూతురు జనని కూడా ఉన్నారు. ఫ్యామిలీ ఫంక్షన్లలో తప్పితే పెద్దగా బయట కనిపించరు బండ్లన్న ఫ్యామిలీ. అయితే ఈ పాదయాత్రలో మాత్రం బండ్లన్న వెంటే ఉన్నారు భార్య, కూతురు. ప్రస్తుతం బండ్ల గణేష్ పాదయాత్ర ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

Bandla Ganesh Family

బండ్ల గణేష్ కు మొత్తం ముగ్గురు సంతానం. ఈ నిర్మాతకు ఇద్దరు కుమారులతో పాటు జనని అనే కూతురు ఉంది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.