Balakrishna: థియేటర్లలో మరోసారి గర్జించనున్న ‘సింహ’.. బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ రీరిలీజ్ ఎప్పుడంటే..

|

Mar 03, 2023 | 6:57 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన చెన్నకేశవ రెడ్డి సినిమా మరోసారి రిలీజ్ అయ్యి భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన బ్లాక్ బస్టర్ హిట్ రీరిలీజ్ అవుతుంది.

Balakrishna: థియేటర్లలో మరోసారి గర్జించనున్న సింహ.. బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ రీరిలీజ్ ఎప్పుడంటే..
Simha
Follow us on

తెలుగు చిత్రపరిశ్రమలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా స్టార్ హీరోస్.. డైరెక్టర్స్ కెరీర్‏లో సూపర్ హిట్స్ అందుకున్న సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పవర్ స్టార్, మహేష్ బాబు, చిరంజీవి, వెంకటేశ్, ఎన్టీఆర్, ప్రభాస్ కెరీర్‏లోని ఆల్ టైమ్ హిట్ చిత్రాలు మరోసారి థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు బిగ్ స్క్రీన్స్ పై బాలయ్య మాస్ గర్జనకు డేట్ లాక్ అయ్యింది. నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన చెన్నకేశవ రెడ్డి సినిమా మరోసారి రిలీజ్ అయ్యి భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన బ్లాక్ బస్టర్ హిట్ రీరిలీజ్ అవుతుంది.

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన సూపర్ డూపర్ హిట్ మాస్ యాక్షన్ చిత్రం సింహ. ఈ సినిమాను మార్చి 11న మరోసారి థియేటర్లలో రీరిలీజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా నయనతార, స్నేహ ఉల్లాల్ కథానాయికలుగా నటించారు. 2010లో తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో సింహా ఒకటి. నమిత, రెహమాన్, కె.ఆర్ విజయ, చలపతి రావు కీలకపాత్రలలో కనిపించారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బాలయ్య.. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఇందులో బాలయ్య కూతురిగా యంగ్ హీరోయిన్ శ్రీలీల కనిపించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.