
నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది ప్రారంభంలోనే భారీ విజయాన్ని అందుకున్నారు. డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత ఆయన నటిస్తోన్న చిత్రం భగవంత్ కేసరి. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలయ్య ఇప్పటివరకు ఎప్పుడూ చూడని పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై మరిన్ని ఆశలు రేకెత్తిస్తున్నాయి. అలాగే ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక గతంలో విడుదలైన ఫస్ట్ లిరికల్ పాటకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలాకాలంగా సెట్స్ పై ఉన్న ఈ సినిమా షూటింగ్ జర్నీ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రయూనిట్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది.
తాజాగా విడుదలైన వీడియోలో షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి కంప్లీట్ అయ్యే వరకు కొన్ని షాట్స్ చూపించారు. మొత్తం 8 నెలలు, 24 లొకేషన్స్, 12 మాసివ్ సెట్స్ తో ఈ మూవీ షూటింగ్ జరిగింది. అలాగే అక్టోబర్ 19న మీ ముందుకు వస్తున్నామంటూ తెలియజేశారు. అలాగే ఆ వీడియోలో బాలయ్య చెప్పిన మాస్ డైలాగ్స్ తో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయంగా తెలుస్తోంది. ప్రస్తుతం భగవంత్ కేసరి జర్నీ వీడియో నెట్టింట వైరలవుతుంది.
Team #BhagavanthKesari completed the thrilling shoot journey with high energy💥
MASSive Worldwide Release on October 19th❤️🔥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi… pic.twitter.com/Dc76vyo30A
— Shine Screens (@Shine_Screens) September 28, 2023
ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం … ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు జరగనున్నాయి. అలాగే భగవంత్ కేసరి ప్రమోషన్స్ కార్యక్రమాలు స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే మొదటి నుంచి వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య శ్రీలీల తండ్రి పాత్రలో కనిపించనున్నారట. దసరా పండగ సందర్భంగా ఈ సినిమా అడియన్స్ ముందుకు రానుంది.
𝐁𝐑𝐎 𝐈 𝐃𝐎𝐍’𝐓 𝐂𝐀𝐑𝐄! 🔥🔥🔥#BhagavanthKesari storming into theatres on October 19th ❤️🔥
– https://t.co/ourdMr5Kug#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna @RamprasadDop… pic.twitter.com/e3t2XTmP5M
— Shine Screens (@Shine_Screens) September 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.